మోదీని చంపేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్‌

ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కు ఈమెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌కి సంబంధించిన వివరాలపై

మోదీని చంపేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్‌
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2020 | 10:50 PM

Threat to Modi: ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కు ఈమెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌కి సంబంధించిన వివరాలపై ఎన్‌ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు ఓ జాతీయ ఛానెల్‌ వెల్లడించింది. ”పలువురు ప్రముఖులను చంపేస్తామంటూ ఓ మెయిల్‌ ఐడీ నుంచి తరచుగా బెదిరింపు మెయిల్‌లు వచ్చాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అంటూ ఎన్ఐఏ ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 8న వచ్చిన ఆ లేఖతో భద్రతా సంస్థలు అప్రమత్తమై ప్రధానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.

మరోవైపు దీనిపై లోతైన దర్యాప్తును చేసేందుకు ఎన్‌ఐఏ.. రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల ప్రతినిధులను రంగంలోకి దింపింది. ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.

మెయిల్ వివరాలివే:

మెయిల్ ఐడీ: ylalwani12345@gmail.com

టు: info.mum.nia@gov.in

పంపిన తేదీ: ఆగష్టు 8, శనివారం

సమయం: 1:34:06 am

సారాంశం: కిల్ నరేంద్ర మోదీ (Kill Narendra Modi).

Read More:

కూతురితో సహా మాజీ నటి అదృశ్యం.. భర్త ఫిర్యాదు

షారూక్‌ని అట్లీ ఎలా చూపించబోతున్నారంటే!