Breaking News
  • భారత్ దేశంలో 6 లక్షలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు. జూన్ నెలలో 4 లక్షల కేసులు,12 వేలకు పైగా మరణాలు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు,18 వేలకు చేరువలో మరణాలు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 19,148 కేసులు, 434మంది మృతి. దేశవ్యాప్తంగా 6,04,641 కేసులు,17,834 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టీవ్ కేసులు, 3,59,860 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ: కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు అదృశ్యం. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడంటున్న కుటుంబ సభ్యులు.
  • అమరావతి: హైకోర్టు ను ఆశ్రయించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. తనని హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం. రేపు విచారించనున్న న్యాయస్థానం.
  • యూపీ ఢిల్లీ హర్యానా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కరోనా మహమ్మారిపై సమీక్ష.
  • మేడ్చల్ జిల్లాల ఇస్మాయిల్ ఖాన్ గూడా లో దారుణం. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో అధ్య అనే ఆరేళ్ళ బాలికను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన కరుణాకర్ అనే వ్యక్తి.
  • గుంటూరు జిల్లా: నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ముప్పాళ్ల si జగదీష్ మోసం చేశాడని మహిళ పిర్యాదు. నాకు ఎలాంటి సంబంధం లేదన్న si జగదీష్. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సింధు. ఎస్సై జగదష్ తో పరిచయం. పెళ్ళి చేసుకుంటానని ఎస్సై మోసం చేశాడని ఆరోపిస్తున్న సింధు. సింధు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు.
  • అమరావతి: రేపు ఢిల్లీకి వెళ్లనున్న వైసిపి ఎంపీలు. స్పీకర్ ను కలిసి రఘురామ కృష్ణంరాజు పై అనర్హత పిటిషన్ ఇచ్చే అవకాశం . రఘురామ కృష్ణంరాజు పై సీరియస్ గా వ్యవహరించాలని నిర్ణయించిన వైసిపి.

యోగాపై నిషేధం.. అలబామా సభ ఎత్తివేత.. ‘నమస్తే’ కి మాత్రం నో !

అమెరికాలోని అలబామాలో దశాబ్దాల కాలంగా యోగాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. భారతీయ యోగాసనాల ప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యాన్ని  గుర్తించి ఈ చర్య తీసుకున్నప్పటికీ.. 'నమస్తే' సంప్రదాయాన్ని బ్యాన్ చేశారు.
Alabama may allow yoga, యోగాపై నిషేధం.. అలబామా సభ ఎత్తివేత.. ‘నమస్తే’ కి మాత్రం నో !

అమెరికాలోని అలబామాలో దశాబ్దాల కాలంగా యోగాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. భారతీయ యోగాసనాల ప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యాన్ని  గుర్తించి ఈ చర్య తీసుకున్నప్పటికీ.. ‘నమస్తే’ సంప్రదాయాన్ని బ్యాన్ చేశారు. అసలే కరోనాతో ప్రపంచ దేశాలు సతమతమవుతుండగా.. ఆయా దేశాధినేతలు ఈ వైరస్ నివారణకు ఇదే (నమస్తే) బెటరని భావిస్తున్న నేపథ్యంలో.. ఇందుకు విరుధ్ధంగా అలబామా సభ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 1993 లో స్కూళ్లలో యోగాను, హిప్నాసిస్ ను, మెడిటేషన్ ను నిషేధిస్తూ..నాడు కన్సర్వేటివ్ లతో కూడిన అలబామా బోర్డ్  ఆఫ్ ఎడ్యుకేషన్ ఓటింగ్ నిర్వహించింది. ఆ ఓటింగులో ఈ నిషేధాలకు అనుకూలంగా మెజారిటీ ఓట్లు పడ్డాయి. అయితే తాజాగా.. ఇటీవల అలబామా ప్రజా ప్రతినిధుల సభలో జెరెమీ గ్రే అనే డెమొక్రటిక్ సభ్యుడు.. యోగాపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ..’యోగాబిల్లు’ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఓటింగ్  నిర్వహించగా.. దీనికి అనుకూలంగా 84, వ్యతిరేకంగా 17 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు సభ ఆమోదం పొందింది. ఓ వైపు నమస్తే ని బ్యాన్ చేస్తూనే. మరోవైపు  యోగాపై నిషేధాన్ని ఎత్తివేయడం విశేషం. ఇక ఈ బిల్లును సెనేట్ లో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనికి ఆ సభలో ఆమోదం లభించి.. గవర్నర్ సంతకం పెట్టిన పక్షంలో అది చట్టమవుతుంది. స్కూళ్లలో యోగా మీద 27 ఏళ్లుగా ఉన్న బ్యాన్ పూర్తిగా అంతమవుతుంది.

 

 

Related Tags