వైసీపీ గూటికి ఆకుల… దసరానే ముహూర్తం ?

కమలం పార్టీని కాదని, పవన్ కళ్యాణ్ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మరోసారి గూడు మారేందుకు సిద్దం అవుతున్నారా.? జనసేన పార్టీలో గత కొంతకాలంగా మౌనమునిగా మారిని ఆకుల ఇప్పుడు అధికార పార్టీ వైపు చేస్తున్నారా..? వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఖరారైందా..? రాజమహేంద్ర వరంలో ఇప్పుడిదే హాట్ హాట్ చర్చ. 2014లో రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ […]

వైసీపీ గూటికి ఆకుల... దసరానే ముహూర్తం ?
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 1:50 PM

కమలం పార్టీని కాదని, పవన్ కళ్యాణ్ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మరోసారి గూడు మారేందుకు సిద్దం అవుతున్నారా.? జనసేన పార్టీలో గత కొంతకాలంగా మౌనమునిగా మారిని ఆకుల ఇప్పుడు అధికార పార్టీ వైపు చేస్తున్నారా..? వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఖరారైందా..? రాజమహేంద్ర వరంలో ఇప్పుడిదే హాట్ హాట్ చర్చ.

2014లో రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తన రాజకీయ ప్రత్యర్థి బొమ్మన రాజ్ కుమార్‌తో పోలిస్తే 26,377 తేడాతో 79,531 ఓట్లతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత పార్ల‌మెంట్ సభ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయాల‌న్న కోరిక‌తో జనసేన పార్టీలో చేశారు. గత ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌లో చేరారు. కానీ, ఓట‌ర్లు మాత్రం ఆయనను కనిరించలేదు. దీంతో మళ్లీ పాత పార్టీ బీజేపీ వైపు అడుగులు వేశారు. కాగా.. బీజేపీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో జనసేనలోనే ఉండిపోయారు. ఏపీఆర్జేసీ నాగార్జునసాగర్‌లో ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.