ట్రైలర్ టాక్: సైంటిస్ట్‌ల విజయం… ఆకాశంలో అద్భుతం!

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు జగన్ శక్తి తెరకెక్కించిన చిత్రం ‘మిషన్ మంగళ్’. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యామీనన్‌లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. 2013లో ఇస్రో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళయాన్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

అప్పట్లో ఈ మిషన్ కోసం శాస్త్రవేత్తలు కఠోరంగా కృషి చేశారు. సొంత టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో వారు ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నారు.. చివరికి విజయవంతంగా మిషన్ ఎలా కంప్లీట్ చేశారనేది కథాంశం. ఇక ఈ చిత్రాన్ని ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *