‘బిగ్ బాస్ 3’ లీకులు షురూ..?

Akkineni Nagarjuna Bigg Boss 3, ‘బిగ్ బాస్ 3’ లీకులు షురూ..?

‘బిగ్ బాస్ 3’ త్వరలోనే రాబోతుందంటూ.. ఇటీవల వచ్చిన ప్రకటన చూసిన చాలామంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని దానికోసం ఎదురు చూస్తున్నారు. వివాదాలు ఎన్ని ఉన్నా.. ‘బిగ్ బాస్’ ప్రోగ్రాం అన్ని భాషల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందిన మాట వాస్తవం. ఇకపోతే ‘బిగ్ బాస్ 3’లో యాంకర్‌గా అక్కినేని నాగార్జున ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే ప్రోమో రావాలంటున్నారు ఫ్యాన్స్.

తాజాగా వాళ్ళ సందేహాలన్నీ తీరుస్తూ ‘బిగ్ బాస్ 3’ లీకులు అప్పుడే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కింగ్ నాగార్జున మీద తీస్తున్న ఓ ప్రోమో వీడియో ఇప్పుడు ఇన్‌స్టా‌గ్రామ్‌లో వైరల్ అవుతోంది. అందులో నాగ్ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుంటే.. చుట్టూ ఉన్న వాతావరణం బిగ్‌బాస్ అని చెప్పకనే చెబుతోంది. యాంకర్ ఎవరనేది తెలిసిపోయింది. ఇక పార్టిసిపెంట్స్ ఎవరూ అనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంది.

మొదటి రెండు సీజన్లు.. జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని తమదైన స్టైల్‌లో షో టీఆర్పీ రేటింగ్స్‌ను అమాంతం పెంచేశారు. మరి ఇప్పుడు కింగ్ నాగార్జున రంగంలోకి రావడంతో షో ఇంకెంత పాపులర్ అవుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *