ఎస్పీతో దోస్తీ.. గళం మార్చిన మాయావతి!

యూపీలో రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరిగాయి. నిన్నటి వరకు ఎస్పీతో పొత్తుకు తెగదెంపులని చెప్పిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజాగా వెనక్కి తగ్గారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో శాశ్వత సంబంధాలకు తామేమి వ్యతిరేకం కాదని మాయావతి పేర్కొన్నారు. కేవలం యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో మాత్రమే తమ పార్టీ ఒంటరి పోటీ చేస్తుందన్నారు. భవిష్యత్తులో అవసరమైతే తమ పార్టీ ఎస్పీతో పొత్తు కుదుర్చుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. అటు రెండు పార్టీలు నమ్మకంతో పని చేస్తేనే కూటమి గెలుస్తుందని.. అయితే ఇరు పార్టీల నేతల మధ్య నమ్మకం లేకుండా పోయిందని మాయావతి వెల్లడించారు.

 

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *