అఖిలప్రియ కొత్త నియోజకవర్గం వెతుక్కోవాల్సిందేనా?

Akhila priya in search for new constituency?

అఖిలప్రియకి దారేది ? ఆమె ఓవైపు వైసీపీ కోసం చూస్తుంటే.. మరోవైపు బీజేపీ వెల్ కమ్ సాంగ్ పాడుతోంది. టీడీపీలో తను ఉండలేకపోతోంది. ఇది అందరికి తెలిసిన సమాచారమే. అయితే ఇప్పుడు అఖిలప్రియకు మరో కొత్త సమస్య వచ్చేలా ఉంది. నియోజకవర్గం కావలెను అన్నట్టుగా తయారైంది ఆమె పరిస్థితి. అదేంటి అఖిలప్రియకు ఆళ్లగడ్డ ఉంది కదా? మళ్లీ కొత్త నియోజకవర్గం కోసం వెతుకులాట ఎందుకు?

రాజకీయాల్లో కష్టాలు కామన్.. కానీ ఇదేంటి అఖిలప్రియని ఇలా వరసగా సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. తాజా ఎన్నికల్లో అటు పార్టీ ఓటమి పాలైంది.ఇటు ఆళ్లగడ్డలో అఖిలప్రియ కూడా ఓడిపోయింది. వైసీపీలోకి వెళ్లాలని ఆమె చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో సీరియస్ గా చర్చ నడుస్తోంది. అదే సమయంలో అఖిలప్రియ అన్న భూమా కిషోర్ రెడ్డి బీజేపీకి జై కొట్టేశారు. దీంతో…భూమా ఫ్యామిలీ అనుచరవర్గం రెండుగా చీలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. భూమా వారసత్వాన్ని అఖిలప్రియ కొనసాగించలేకపోతుందన్న అసహనంతోనే బీజేపీలో చేరినట్టు భూమా కిషోర్ రెడ్డి చెబుతున్నారు.

దీంతో అనుచరవర్గం అటువైపు వెళ్లకుండా ఉండాలంటే భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని వారసుడిగా తీసుకురావలన్న ఒత్తిడి ఆమెపై పెరుగుంతోంది. అయితే జగత్ విఖ్యాత్ రెడ్డిని పాలిటిక్స్ లోకి తీసుకొస్తే.. వచ్చే ఎన్నికల్లో భూమా వారసుడిగా ఆళ్లగడ్డ నుంచే బరిలోకి దిగాలి. మరి అఖిలప్రియ కొత్త నియోజకవర్గం వెతుక్కోవాల్సిందే కదా అన్న ప్రశ్నలు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *