‘అఖిల్ 4’ షురూ..!

Akhil Akkineni, ‘అఖిల్ 4’ షురూ..!

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘అఖిల్ 4′(వర్కింగ్ టైటిల్) ప్రారంభమైంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ ఫిల్మ్ నగర్ దేవాలయంలో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, అమల ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జూన్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా జీఏ2 ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మిగిలిన తారాగణం ఎవరనేది త్వరలోనే తెలియజేయనుంది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాని ఈఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *