డాలస్‌లో వైసీపీ ‘మీట్ అండ్ గ్రీట్‌’

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎన్నారైల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి గెలుపు ఎవరిది? అన్నదానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇదిలావుండగా అమెరికాలోని డాలస్‌లో వైసీపీ ‘మీట్ అండ్ గ్రీట్‌’ ఏర్పాటు చేసింది. ప్రవాసాంధ్ర నేతలు నాగిరెడ్డి, దర్గారెడ్డి, రాజేంద్ర ఆధ్వరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. వైసీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి హాజరయ్యారు. దివంగత రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆకిపాటికి పేరుంది. అక్కడ ఆయనను సన్మానించారు. ఏపీలో వెల్లడికానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమర్‌నాథ్‌రెడ్డి.. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చినవారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదన్నారు. వైఎస్, జగన్‌పై ప్రేమ చూస్తుంటే తనకు ఆశ్యర్యం వేస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *