నిలకడగా అక్బరుద్దీన్ ఆరోగ్యం

ఎంఐఎం సీనియర్ నాయకుడు, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే అక్బర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోలుకునేలా అల్లాను ప్రార్థించాలంటూ ఆయన సోదరుడు అసదుద్దీన్ ఆదివారం పార్టీ శ్రేణులను కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పరిస్థితి బావుందంటూ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే 2011 ఏప్రిల్‌లో బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. తీవ్ర గాయాలకు గురైన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇటీవల […]

నిలకడగా అక్బరుద్దీన్ ఆరోగ్యం
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 9:50 AM

ఎంఐఎం సీనియర్ నాయకుడు, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే అక్బర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోలుకునేలా అల్లాను ప్రార్థించాలంటూ ఆయన సోదరుడు అసదుద్దీన్ ఆదివారం పార్టీ శ్రేణులను కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పరిస్థితి బావుందంటూ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

అయితే 2011 ఏప్రిల్‌లో బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. తీవ్ర గాయాలకు గురైన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇటీవల కొంత సమస్య తలెత్తడంతో గత నెల 5న చికిత్స కోసం కుటుంబసమేతంగా లండన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.