ఆకట్టుకుంటోన్న ‘నేర్కొండ పార్వై’ ట్రైలర్!

Ajith Kumar, ఆకట్టుకుంటోన్న ‘నేర్కొండ పార్వై’ ట్రైలర్!
తమిళ అభిమానులు ముద్దుగా ‘తలా’ అని పిలుచుకుంటున్న స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేర్కొండ పార్వై’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు ఇది తమిళ రీమేక్. ఇందులో అజిత్ కుమార్ లాయర్ పాత్ర పోషిస్తున్నాడు.
మహిళల అంశాలను టచ్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్‌లో అజిత్ లాయర్‌గా పూర్తి న్యాయం చేశాడని అర్ధమవుతోంది. ఇక శ్రీదేవి భర్త బోణి కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, అర్జున్ చిదంబరం, అశ్విన్ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ క్యామియో పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రం ఆగష్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *