పంతం నెగ్గింది.. ఎన్సీపీ నేతగా మళ్ళీ అజిత్ పవార్ !

ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా అజిత్ పవార్ మళ్ళీ ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జయంత్ పాటిల్ స్థానే ఈయనను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నియమించారు. పైగా ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలో ఏర్పడనున్న నూతన ప్రభుత్వంలో అజిత్.. డిప్యూటీ సీఎం పదవి చేబట్టవచ్ఛునని వార్తలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం శరద్ పవార్ తోను, ఆయన కుమార్తె సుప్రియా సూలే తోను, ఇతర నాయకులతోను సమావేశమైన అజిత్.. తను తిరిగి ఎన్సీపీ గూటిలో చేరేందుకు సంసిధ్ధత […]

పంతం నెగ్గింది.. ఎన్సీపీ నేతగా మళ్ళీ అజిత్ పవార్ !
Follow us

|

Updated on: Nov 27, 2019 | 4:50 PM

ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా అజిత్ పవార్ మళ్ళీ ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జయంత్ పాటిల్ స్థానే ఈయనను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నియమించారు. పైగా ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలో ఏర్పడనున్న నూతన ప్రభుత్వంలో అజిత్.. డిప్యూటీ సీఎం పదవి చేబట్టవచ్ఛునని వార్తలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం శరద్ పవార్ తోను, ఆయన కుమార్తె సుప్రియా సూలే తోను, ఇతర నాయకులతోను సమావేశమైన అజిత్.. తను తిరిగి ఎన్సీపీ గూటిలో చేరేందుకు సంసిధ్ధత వ్యక్తం చేశారు. నాలుగు గంటలకు పైగా రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో ఆయనను మళ్ళీ పార్టీలోకి, కుటుంబంలోకి ఆహ్వానించేందుకు అంతా ఓకె చెప్పారని, కానీ భవిష్యత్తులో తిరిగి ఎలాంటి ‘ పొరబాట్లు ‘ చేయరాదని హెచ్ఛరించారని తెలిసింది. చివరకు ‘ అంకుల్’ శరద్ పవార్ తో అజిత్ రాజీకి రాక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే అజిత్ ను సుప్రియా సూలే ఈ ఉదయం అసెంబ్లీ వద్ద ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ‘ అజిత్ దాదా ‘ కు వెల్ కమ్ చెప్పడానికి ఎన్సీపీ పూర్తి సుముఖంగా ఉన్నప్పటికీ.. ‘ మహా వికాస్ అఘాడీ ‘ లో మిత్ర పక్షాలుగా ఉన్న శివసేన, కాంగ్రెస్ పార్టీలకు ఇది ఏ మాత్రం రుచించలేదట.. అజిత్ ‘ 80 గంటల తిరుగుబాటు, ఆతర్వాత హోం కమింగ్ ‘ ని ఈ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి.