కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరసన అందాల “ఐష్”

అతిలోక సుందరికి ఇప్పటికీ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫార్టీ ప్లస్‌లోనూ ఆమె అందమే అందం. వెరీ రీసెంట్‌గా రణబీర్ కపూర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది ఒక సినిమాలో. అది ఆమె చరిష్మా, గ్లామర్. అలాంటి నటి ఇప్పుడు విలన్‌గా మారనుండటం వెరైటీ. ఐశ్వర్య రాయ్ తొలి చిత్రం.. “ఇద్దరు” స్టార్ డైరెక్టర్ మణిరత్నం తీసిన క్లాసిక్ అది. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్‌లోనే గురు, రావణ వంటి సినిమాల్లో నటించింది ఐశ్వర్యారాయ్. సినిమా ఇండస్ట్రీలో నాకు […]

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరసన  అందాల  ఐష్
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 4:49 PM

అతిలోక సుందరికి ఇప్పటికీ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫార్టీ ప్లస్‌లోనూ ఆమె అందమే అందం. వెరీ రీసెంట్‌గా రణబీర్ కపూర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది ఒక సినిమాలో. అది ఆమె చరిష్మా, గ్లామర్. అలాంటి నటి ఇప్పుడు విలన్‌గా మారనుండటం వెరైటీ. ఐశ్వర్య రాయ్ తొలి చిత్రం.. “ఇద్దరు” స్టార్ డైరెక్టర్ మణిరత్నం తీసిన క్లాసిక్ అది. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్‌లోనే గురు, రావణ వంటి సినిమాల్లో నటించింది ఐశ్వర్యారాయ్. సినిమా ఇండస్ట్రీలో నాకు గురువు మణిరత్నం అని చెబుతుంటుంది ఐష్ ..అందుకే తన గురువు విలన్ లక్షణాలుండే పాత్ర ఇచ్చినా నో చెప్పలేకపోయింది. మణిరత్నం కొత్త సినిమాలో ఆమె ఈ పాత్ర చేయనుంది.

మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే ఒక భారీ చారిత్రక సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో కార్తీ, విక్రమ్, జయం రవి, మోహన్‌బాబు, అరవిందస్వామి, విజయ్ సేతుపతి ..ఇలా బిగ్ క్యాస్ట్ ఉంది. సీనియర్ నటుడు మోహన్‌బాబు.. వయసు మళ్లిన కింగ్ పాత్ర పోషించనున్నాడు. ఆయన భార్యగా ఐశ్వర్యారాయ్ నటించనుందనేది టాక్. మోహన్‌బాబుకి జోడిగా ఐష్ నటించడమే ఒక హైలెట్ అయితే ఆ పాత్రకి నెగిటివ్ టచ్ కూడా ఉండటం మరో హై పాయింట్. రోబో సినిమా తర్వాత సౌత్ లో చేస్తున్న మూవీ ఇది. దాదాపు 10ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె దక్షిణాది సినిమాకు ఓకే చెప్పారు.