Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

వినియోగదారులకు భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్ ..

Airtel Rs. 558 Prepaid Recharge Plan Revised, వినియోగదారులకు భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్ ..

టెలికాం సంస్థలన్నీ ఇప్పుడు సామాన్యుడి నడ్డివిరిచేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్‌ ఆఫర్లను ఇచ్చిన సంస్థలు.. తాజాగా వాటిపై షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ఆపరేటర్లు మాత్రం.. ఛార్జీలను పెంచుతూ అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఆఫర్‌ను పునరుద్దరించి వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఎయిర్‌టెల్ ఆఫర్ ప్లాన్లను మార్చుతూ వినియోగదారుల.. చాపకింద నీరులా తెలియకుండా ఛార్జీలన మోత మోగిస్తోంది.

తాజాగా మరోసారి ఎయిర్ టెల్ సంస్థ వినియోగదారులకు షాకిచ్చింది. అయితే ఈ సారి అన్‌లిమిటెడ్ అవుట్‌ గోయింగ్ కాల్స్‌ ఆఫర్ ఇస్తూనే.. గడువును కుదిస్తూ.. షాకిచ్చింది. రూ.558 ప్లాన్‌లో అనేక మార్పులు చేసింది. ప్లాన్‌ గడువును దాదాపు 26 రోజులు తగ్గించింది. అయితే మిగిలిన ఆఫర్లను యథాతథంగా ఉంచింది. అయితే ఇటీవలే టారీఫ్ ధరలను భారీగా పెంచి.. ఇప్పుడు గడువును కుదించింది.

ఈ రూ.558 ప్లాన్‌‌లో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌‌తో పాటుగా.. రోజుకు 3జీబీ డేటా, 100 ఎమ్మెస్‌లు లభిస్తాయి. అయితే దీని కాలపరిమితి 82 రోజులు ఉన్నదానిని.. ఇప్పుడు నాలుగు వారాలకు కుదించి.. 56 రోజులకు వర్తించేలా చేసింది. అయితే ఈ ప్లాన్‌‌తో పాటుగా అదనంగా వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ప్రీమియమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించనుంది. దీంతోపాటు ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌ కూడా ఈ ప్లాన్‌లో లభించనుంది.

Related Tags