కరోనాను కనిపెట్టే పనిలో జాగిలాలు..స్పెష‌ల్ ట్రైనింగ్..!

ఇప్పటివ‌ర‌కు ఒక లెక్క‌..ఇప్ప‌ట్నుంచి ఒక లెక్క‌. విశ్వాసంలో సాటిలేని జాగిలాలు ఇప్ప‌టివ‌ర‌కు పోలీసువారికి నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డానికి స‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కరోనాను కనిపెట్టే పనిలో జాగిలాలు..స్పెష‌ల్ ట్రైనింగ్..!
Follow us

|

Updated on: Jul 27, 2020 | 7:08 PM

sniffer dogs could detect Covid-19 : ఇప్పటివ‌ర‌కు ఒక లెక్క‌..ఇప్ప‌ట్నుంచి ఒక లెక్క‌. విశ్వాసంలో సాటిలేని జాగిలాలు ఇప్ప‌టివ‌ర‌కు పోలీసువారికి నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డానికి స‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పై క‌రోనా రోగుల‌ను కూడా అవి గుర్తించ‌నున్నాయి. అవును..క‌రోనా సింట‌మ్స్ ఉన్న‌వారికి ప‌ట్టుకునేందుకు వాటికి స్పెష‌ల్ ట్రైనింగ్ ఇవ్వ‌బోతున్నారు. క‌రోనాతో ప్ర‌జలంతా స‌త‌మ‌త‌మవుతోన్న స‌మయంలో..వ్యాధిగ్ర‌స్తుల నిర్దార‌ణ క‌త్తి మీద సాముగా మారింది. ఈ క్రమంలో సింట‌మ్స్ ఉన్నవారిని గుర్తించేందుకు లండన్, అమెరికా వంటి దేశాల్లో స్నిఫ్పర్ డాగ్స్‌కు ట్రైనింగ్ ఇస్తున్నారు.

శునకాలకు మంచి శిక్షణ ఇస్తే.. కరోనాను కూడా పసిగడుతున్నాయని సెంటిస్టులు తెలిపారు. అలా క‌నిపెట్ట‌డం ద్వారా వ్యాధి వ్యాప్తిని చాలావ‌ర‌కు అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పటికే పలు దేశాల్లో స్నిప్పర్స్ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. కరోనా లక్షణాలు ఉన్న‌వారిని కనిపెట్టే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు.