ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి యుద్ధ విమానం…!

OLXలో మనం ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు, గృహోపకరణాలను మాత్రమే అమ్మకానికి ఉంచేవారిని చూశాం. ఆ మధ్య ఓ ప్రభుద్దుడు ఆన్‌లైన్ అమ్మకాల్లో...

ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి యుద్ధ విమానం...!
Follow us

|

Updated on: Aug 05, 2020 | 6:21 PM

OLXలో మనం ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు, గృహోపకరణాలను మాత్రమే అమ్మకానికి ఉంచేవారిని చూశాం. ఆ మధ్య ఓ ప్రభుద్దుడు ఆన్‌లైన్ అమ్మకాల్లో భార్యకు అమ్మకానికి ఉంచి పెద్ద సంచలనంగా మారాడు. ఇప్పుడు  తాజాగా ఓ ప్రబుద్ధుడు ఏకంగా భారత యుద్ధ విమానాన్నే అమ్మకానికి పెట్టాడు. అదికూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన యుద్ధ విమానం.. అదులోనూ అది పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపించిన యుద్ధ విమానం.

భారత వాయుసేన (IAF)కు చెందిన మిగ్‌-23 యుద్ధ విమానాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి 2009లో ఐఏఎఫ్ బహుమతిగా ఇచ్చింది. దీనిని యూనివర్శిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల ముందు భాగంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఎవరో ఆకతాయి రూ.9.99 కోట్లకు ఈ యుద్ధ విమానాన్ని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై యూనివర్శిటీ అధికార ప్రతినిధి వసీమ్‌ అలీ స్పందించారు. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఈ యుద్ధ విమానాన్ని ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనల కోసం యూనివర్శిటీకి ఐఏఎఫ్ బహుమతిగా ఇచ్చిందని అన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన విమానం అమ్మకానికి ఉంచడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతీయడానికే ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని అభిప్రాయ పడ్డారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీమ్‌ అలీ చెప్పారు. ప్రస్తుతం (OLX) ఓఎల్‌ఎక్స్ ప్రతినిధులు ఈ ప్రకటనను తొలగించారు. అయితే ఇంతటి పిచ్చిపనికి పాల్పడిన ప్రభుద్ధుడిని పట్టుకునే పనిలో పడ్డారు యూపీ పోలీసులు.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..