Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

ఎయిరిండియా సేల్.. మోదీ ప్రభుత్వంపై సుబ్రమణ్యస్వామి ఫైర్

For the second time in two years the government, ఎయిరిండియా సేల్.. మోదీ ప్రభుత్వంపై సుబ్రమణ్యస్వామి ఫైర్

అప్పుల భారంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్రయానికి పెడతామంటూ మోదీ ప్రభుత్వం సోమవారం చేసిన ప్రకటనపై సాక్షాత్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. ఇది జాతి వ్యతిరేకమని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీల్ పై మోదీ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని ట్వీట్ చేశారు. ‘మన కుటుంబ ఆభరణాన్ని ఎలా అమ్ముతాం’ అని ప్రశ్నించారు. ఎయిరిండియా నష్టాలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ సంస్థను ఆదుకోకుండా ఎందుకు విక్రయిస్తున్నారని కూడా ఆయన సూటిగా పేర్కొన్నారు. అటు-ఎయిరిండియా డిజిన్విస్ట్ మెంట్ పై సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కూడా తీవ్రంగా విమర్శించారు.’ ప్రభుత్వాల వద్ద నిధులు లేనప్పుడు ఇలాంటి పనులకే ఒడిగడతాయని అన్నారు.’ ఆర్ధిక వృద్ది 5 శాతానికి దిగజారింది.. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి.. ఈ విధమైన పరిస్థితుల్లో మన దగ్గరున్న అమూల్యమైన ఆస్తులన్నీ ప్రభుత్వాలు అమ్మేస్తాయి’ అని ఆయన దుయ్యబట్టారు.


ఎయిరిండియా విక్రయానికి సంబంధించి ప్రభుత్వం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి గల బిడ్డర్లు మార్చి 17 లోగా తమ సంసిధ్ధతను తెలపాలని కోరింది. క్వాలిఫై అయిన బిడ్డర్లను  మార్చి 31 న నోటిఫై చేస్తామని పేర్కొంది. అయితే ఈ స్ట్రాటిజిక్ డిజిన్విస్ట్ మెంట్ కు సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం మాత్రం ఈ తేదీలు మార్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్లలో ఎయిరిండియాను ఇలా వంద శాతం అమ్మకానికి పెడతామని ప్రభుత్వం ప్రకటించడం ఇది రెండో సారి. నష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి లాభాల బాటలోకి తెచ్చేబదులు..దాన్ని   ఏకంగా అమ్మేస్తారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Related Tags