పైలట్‌కు కరోనా పాజిటివ్..గాల్లోనే ప్రయాణికులు..!

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ప్రత్యేకంగా విమానాలు పంపి అక్కడున్నవారిని స్వదేశానికి తీసుకొస్తున్నారు.

పైలట్‌కు కరోనా పాజిటివ్..గాల్లోనే ప్రయాణికులు..!
Follow us

|

Updated on: May 30, 2020 | 4:18 PM

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ప్రత్యేకంగా విమానాలు పంపి అక్కడున్నవారిని స్వదేశానికి తీసుకొస్తున్నారు. భాగంగా శనివారం ఢిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కో, బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మార్గమధ్యలోనే వెనక్కి రప్పించారు.

వందేభారత్ మిషన్‌లో భాగంగా ఏ320 విమానం ప్రయాణికులు లేకుండానే మాస్కో బయల్దేరింది. ఉబ్బెకిస్థాన్ గగనతలంలోకి చేరుకునే సమయానికి పైలట్లలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విమానం వెనక్కి రావాలని ఆదేశించగా.. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీకి తిరిగిచ్చినట్లు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. పైలట్‌ను ఐసోలేషన్ వార్డుకు తరలించగా, ..విమానంలోని మిగతా సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు.

ఇదిలా ఉంటే, సిబ్బంది ప్రీ-ఫ్లైట్ టెస్ట్ రిపోర్టులను తనిఖీ చేస్తున్న బృందం.. పైలట్‌కు పాజిటివ్ రాగా.. పొరపాటున అతడికి నెగెటివ్‌గా వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఆ పైలట్‌ను విమానంలోకి అనుమతించారు. విమానం బయలుదేరిన తర్వాత పొరపాటును గుర్తించడంతో వెంటనే దాన్ని వెనక్కు రప్పించడం గమనార్హం.