ఫ్లైట్‌లో ఎయిర్ హోస్టెస్ చేసిన పనికి అంతా షాక్…నిజం తెలిశాక అభినందనలు!

A heartwarming gesture by a flight attendant, ఫ్లైట్‌లో ఎయిర్ హోస్టెస్ చేసిన పనికి అంతా షాక్…నిజం తెలిశాక అభినందనలు!

ఎయిర్‌హోస్టెస్‌..అంటే ఇలా ఉండాలి. అంటే అందంగా కాదండోయ్..అందమైన మనసుతో.  విమానంలో ఓ దివ్యాంగురాలి పట్ల ఎయిర్ హోస్టెస్ చూపిన శ్రద్ధ నెటిజన్లతో శభాష్ అనిపిస్తోంది. సమాజానికి దివ్యాంగుల పట్ల కొంతలో కొంతైనా బాధ్యత వుండాలని చెబుతోంది ఈ ఘటన. డెల్డా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎండీవర్‌ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వినికిడి లోపం వున్న ఆష్లే అనే యువతి ఎండీవర్‌ విమానంలో ప్రయాణించింది. ఆమెకు వినికిడి లోపం వుందన్న విషయం తెలుసుకున్న ఎయిర్‌హోస్టెస్‌ జన్నా ఓ ఉద్యోగిలా కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తిలా వ్యవహరించింది. ఆష్లేకి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఓ కాగితం మీద విమానంలో ఉన్న సౌకర్యాల గురించి రాసి ఇచ్చింది.

‘దానిలో హాయ్‌ ఆష్లే.. ఈ రోజు నేను ఈ ఫ్లైట్‌ అటెండెంట్‌ని. నీవు కూర్చున్న సీటు పై భాగంలో అనగా నీ తలపైన రెండు బటన్లు ఉన్నాయి. వాటిలో పసుపుపచ్చది లైట్‌ని కంట్రోల్‌ చేస్తుంది. నీకు నాతో ఏమైనా అవసరం ఉంటే బూడిదరంగులో పెద్దగా ఉన్న బటన్‌ను ప్రెస్‌ చేస్తే నేను నీ దగ్గరకు వస్తాను. అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. నీ వెనకే ఉన్న ఎక్జిట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయ్‌. నీకు ఏ సాయం కావాలన్న నన్ను అడుగు. మొహమాట పడకు’ అంటూ కాగితం మీద రాసిచ్చింది. ఆ లెటర్ చదివిన ఆష్లే తల్లి భావోద్వేగానికి లోనైంది. వెంటనే  ఫోటో తీసి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *