Breaking News
  • విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి. 11 రోజుల పాటు సాగిన అమృత పాశుపత సహిత యాగం. యాగాన్ని పర్యవేక్షించిన శారదా పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.
  • కరోనా వల్ల ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారం సేకరిస్తున్నాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తున్నాం-మోపిదేవి.
  • ప్రజల రాకపోకలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం-మంత్రి కన్నబాబు. కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడం. ప్రజలకు సాయం అందించడం. ఫారెన్‌ రిటర్న్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక వ్యూహం-కన్నబాబు.
  • రాష్ట్రంలో పాల సరఫరాపై వివిధ డైరీలతో మంత్రి తలసాని సమీక్ష. డోర్‌డెలివరీ యాప్‌ల ద్వారా పాల సరఫరా. పాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు-మంత్రి తలసాని. పాల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు-తలసాని.
  • నిజామాబాద్‌లో కల్లు దొరకక ఇద్దరు మృతి. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులుగా దొరకని కల్లు.
  • లాక్‌డౌన్‌తో చెన్నైలో విజయనగరం వాసుల అవస్థలు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు. టీవీ9కు తమ గోడు చెప్పుకున్న కూలీలు.

కుప్పకూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. వింగ్ కమాండర్ జీఎస్ చీమ మృతి

Air Force Pilot Killed As Trainer Aircraft Crashes In Punjab's Patiala, కుప్పకూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. వింగ్ కమాండర్ జీఎస్ చీమ మృతి

పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. పాటియాలలో సోమవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఓ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యింది. పాటియాల ఏవియేషన్ క్లబ్‌కు చెందిన ఈ ఎయిర్ క్రాఫ్ట్… టేకాఫ్ అయిన కాసేపటికి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన ఓ గ్రూప్ వింగ్ కమాండర్ మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వీరు ఎన్‌సీసీ క్యాడెట్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. పాటియాలాలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏవియేషన్‌ క్లబ్‌కు చెందిన మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 3వ ఎయిర్‌ స్క్వాడ్రన్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ చీమ గుర్‌ప్రీత్‌సింగ్‌ మృతి చెందగా.. ఎన్‌సీసీ క్యాడెట్‌‌కు చెందిన విపిన్‌కుమార్‌ యాదవ్‌, మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీం.. గాయపడ్డ ఇద్దర్ని.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వింగ్‌ కమాండర్‌ చీమ గుర్‌ప్రీత్‌సింగ్‌ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు ట్రైనీలు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానన్నారు.

Related Tags