ఎంఐఎం అధినేత ఓవైసీకి డీఎంకే ఆహ్వానం.. పెరంబూర్ మహానాడుకు హాజరు కావాలంటూ విజ్ఞప్తి

డీఎంకే మహానాడుకు హాజరు కావాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఆపార్టీ ఆహ్మానం పంపింది.

ఎంఐఎం అధినేత ఓవైసీకి డీఎంకే ఆహ్వానం.. పెరంబూర్ మహానాడుకు హాజరు కావాలంటూ విజ్ఞప్తి
Follow us

|

Updated on: Jan 02, 2021 | 9:47 AM

మజ్లిస్‌ పార్టీ అధినేత, పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీకి తమిళనాడు నుంచి ఆహ్వానం అందింది. పెరంబూర్ నగరంలో నిర్వహించనున్న డీఎంకే మహానాడుకు హాజరు కావాలంటూ ఆపార్టీ ఆహ్మానం పంపింది. స్థానిక రాయపేట వైఎంసీఏ మైదానంలో ఈ నెల 6వ తేది డీఎంకే ఆధ్వర్యంలో ‘హృదయాలను కలుపుదాం’ పేరిట మహానాడును తలపెట్టింది. ఈ మహానాడుకు పాల్గొనేందుకు అఖిల భారత మజ్లిస్‌ ఈ-ఇడిహదుల్‌ ముస్లిం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీను డీఎంకే మైనార్టీ సంక్షేమ విభాగం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌ కలుసుకొని ఆహ్వానం పలికారు. ఇందుకు ఓవైసీ అంగీకరించినట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి. ఓవైసీ రాకతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓవైసీ నేతృత్వం లోని మస్లిస్‌ పార్టీ పోటీ చేసి 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు దక్షిణాదికే పరిమితమైన మజ్లిస్‌ పార్టీ తొలి సారిగా ఉత్తరాదిన కూడా సత్తా చాటింది. కాగా, డీఎంకేతో కూటమిలో చేరేందుకు ఆసక్తి ఉన్నట్లు ఇటీవల ఓవైసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, డీఎంకే మహానాడులో ఓవైసీ పాల్గొనడం ఆసక్తి రేపుతుంది.