పాక్ నటులను బ్యాన్ చేయండి..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. అయితే భారత్‌లో కూడా పాక్‌కు సంబంధించి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారతీయ సినిమాలను పాక్‌లో నిషేదించడంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) మండిపడింది. ఇకపై పాక్ నటీనటులను భారతీయ సినిమాల్లో నటించకుండా చూడాలని ప్రధాని మోదీకి లేఖ రాసింది. అదే విధంగా భారత్ విషయలో పాక్ తీసుకున్నట్టుగానే ఇక్కడ కూడా పాక్ ఆర్టిస్టులు, సంగీత కళాకారులు, దౌత్యవేత్తలను నిషేదించాలని కోరింది. పాక్ […]

పాక్ నటులను బ్యాన్ చేయండి..
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2019 | 8:26 AM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. అయితే భారత్‌లో కూడా పాక్‌కు సంబంధించి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారతీయ సినిమాలను పాక్‌లో నిషేదించడంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) మండిపడింది. ఇకపై పాక్ నటీనటులను భారతీయ సినిమాల్లో నటించకుండా చూడాలని ప్రధాని మోదీకి లేఖ రాసింది. అదే విధంగా భారత్ విషయలో పాక్ తీసుకున్నట్టుగానే ఇక్కడ కూడా పాక్ ఆర్టిస్టులు, సంగీత కళాకారులు, దౌత్యవేత్తలను నిషేదించాలని కోరింది. పాక్ బుద్ధి వచ్చేలా ప్రధాని నిర్ణయం తీసుకోవాలని అప్పటివరకు మొత్తం చిత్రపరిశ్రమ, సినీ కార్మికులు పనులు మొదలుపెట్టబోమంటూ ఏఐసీడబ్ల్యూఏ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంంది.