బీటెక్ విద్యార్థులకు.. సెప్టెంబర్‌ 15 నుంచి నూతన విద్యా సంవత్సరం షురూ..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ

బీటెక్ విద్యార్థులకు.. సెప్టెంబర్‌ 15 నుంచి నూతన విద్యా సంవత్సరం షురూ..!
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 6:55 AM

AICTE Revised Academic Calendar: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్‌ 15న మొదలుకానుంది. ఈ మేరకు గురువారం అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) రివైజ్డ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ను జారీ చేసింది.

గతంలో ఫస్ట్ ఇయర్ లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్‌ ఒకటి, ఇతర విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను సవరించింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి తరగతుల(విద్యా సంవత్స రం)ను ప్రారంభించాలని పేర్కొంది.

ప్రస్తుత విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మొదలుపెట్టాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును గతంలో జూన్‌ 30 వరకు ఇవ్వాలని పేర్కొనగా, ఇప్పుడు దానిని సవరించి జూలై 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్‌ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని, మిగిలిన సీట్లను సెప్టెంబర్‌ 15లోగా పూర్తి చేయాలని పేర్కొంది. పీజీసీఎం/పీజీడీఎం కోర్సుల్లో చేరిన వారికి ఆగస్టు 1వ తేదీకల్లా తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు