న్యూ టెక్నాలజీ.. గుండె జబ్బులకు ఇకపై ఫుల్‌స్టాప్ !

ప్రస్తుత రోజుల్లో ఏ పని చేసినా ప్రతిదానికీ టెక్నాలజీతో లింకు పెడుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే నేటి యుగంలో టెక్నాలజీ వినియోగం
విస్తారంగా పెరిగిపోయింది. ఇంకా లోతుగా చెబితే.. జీవితాల మధ్యలోకి చొరబడిపోయింది. దీనివల్ల మంచే కాదు.. చెడు కూడా వుంది.
ఇక అసలు విషయానికొస్తే.. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్-ఏఐ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆ సెక్టార్‌లో అనూహ్య
మార్పులొస్తున్నాయి. లేటెస్ట్‌గా ఫిన్‌లాండ్‌కి చెందిన శాస్త్రవేత్తలు గుండె సంబంధిత వ్యాధులను గుర్తించే సరికొత్త వ్యవస్థను రెడీ చేశారు.
లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ వ్యవస్థ.. రాబోయేరోజుల్లో గుండె వ్యాధులను డాక్టర్ల కంటే ముందుగా గుర్తించవచ్చన్నది పరిశోధకుల
మాట. సుమారు 950 మంది రోగులపై ఆరేళ్లపాటు పరిశోధన చేశారు. చివరకు ఈ టెక్నాలజీ పని తీరు పట్ల చివరకు నిర్ధారణకు వచ్చేశారు.
ముఖ్యంగా గుండె కొట్టుకునే తీరు, వేగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా చేయనుంది. దీంతో భవిష్యత్తులో గుండెపోటు వచ్చే
అవకాశాలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పసిగడుతుందని బలంగా చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల రోగికి ముందుగానే ట్రీట్‌మెంట్
ఇవ్వడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని లిస్బన్‌లో జరిగిన హృదయ-గుండె సంబంధిత అంతర్జాతీయ సమావేశంలో అభిప్రాయపడ్డారు
రీసెర్చర్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *