దూకుడు పెంచుతున్న వైసీపీ

ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల సమరంలో వైసీపీ దూకుడు పెంచింది. గెలుపు గుర్రాల కోసం జగన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ లిస్ట్‌ను బట్టి అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి పోటీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది. కాగా.. కాకినాడలో వైసీపీ సమరశంఖారవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ నేతలు. భారీగా జనం తరలివస్తారని.. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు డేటా చోరీపై ఈసీకి ఫిర్యాదు […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:37 pm, Mon, 11 March 19

ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల సమరంలో వైసీపీ దూకుడు పెంచింది. గెలుపు గుర్రాల కోసం జగన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ లిస్ట్‌ను బట్టి అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి పోటీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది.

కాగా.. కాకినాడలో వైసీపీ సమరశంఖారవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ నేతలు. భారీగా జనం తరలివస్తారని.. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు డేటా చోరీపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సిద్ధమౌతోంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లి ఈసీకి కంప్లైంట్ చేయనుంది. ఏపీలో లక్షల ఓట్లు గల్లంతయ్యాయని.. సేవామిత్ర యాప్‌తో ప్రజల డేటాను చోరీ చేశారని వైసీపీ ఈసీకి వివరించనుంది. విజయసాయిరెడ్డి నేత‌ృత్వంలో వైసీపీ బృందం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.