రిపబ్లిక్‌ డే సందర్బంగా.. కాంగ్రెస్‌ నేతల ఫైట్‌..!

రిపబ్లిక్ డే  సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రిపబ్లిక్ డే సందర్భంగా త్రివర్ణాన్ని ఎగురవేయడానికి పార్టీ కార్యాలయానికి రావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌ కుంజీర్‌, పార్టీ సీనియర్‌ నేత […]

రిపబ్లిక్‌ డే సందర్బంగా.. కాంగ్రెస్‌ నేతల ఫైట్‌..!
Follow us

| Edited By:

Updated on: Jan 26, 2020 | 5:18 PM

రిపబ్లిక్ డే  సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రిపబ్లిక్ డే సందర్భంగా త్రివర్ణాన్ని ఎగురవేయడానికి పార్టీ కార్యాలయానికి రావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌ కుంజీర్‌, పార్టీ సీనియర్‌ నేత దేవేంద్ర సింగ్‌ యాదవ్‌ ఒకరికొకరు దూషించుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

కుంజీర్ వేదిక దగ్గరకు చేరుకున్న తరువాత గొడవ మొదలైంది. యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో అక్కడున్న వారు, పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కొద్ది నిమిషాల తరువాత నాథ్ వచ్చి జాతీయ జెండాను ఎగురవేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

[svt-event date=”26/01/2020,4:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]