Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు మెడికల్‌ కాలేజీలో కరోనా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

బడ్జెట్ సమర్పణకు ముందు.. 2018-19 ఎకనమిక్ సర్వే ఏం చెబుతోందంటే..

FINANCE MINISTER NIRMALA SITARAMAN, బడ్జెట్ సమర్పణకు ముందు.. 2018-19 ఎకనమిక్ సర్వే ఏం చెబుతోందంటే..

2019-20 సంవత్సరానికి పార్లమెంటులో తన కేంద్ర బడ్జెట్ ను సమర్పించడానికి ముందు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. గురువారం 2018-19 ఏడాదికి గాను ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ రూపొందించిన ఈ సర్వే ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద ఐదో ‘ ఎకనామిక్ ‘ దేశంగా తయారయ్యేందుకు అనువైన సూచనలు, మార్గాన్ని ఇవ్వనుంది. 2024 సంవత్సరానికి భారత దేశం 5 ట్రిలియన్ యుఎస్ డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థను సంతరించుకుని దీన్ని పూర్తిగా పునరుజ్జీవింపజేయాలన్నమోదీ ప్రభుత్వ లక్ష్యాలకు అవసరమైన సంస్కరణల రోడ్ మ్యాప్ కు ఈ సర్వే దోహదపడుతుందని భావిస్తున్నారు. అలాగే దేశం ముందున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలను కూడా ఈ సర్వే సూచించవచ్చు. దేశ వార్షిక ఆర్థికాభివృధ్ది స్థాయిని ఇది ప్రతిబింబించవచ్ఛు . మోదీ 2.0 ప్రభుత్వంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు. అసలు ఎకనమిక్ సర్వే అంటే.. జనవరి-మార్చి త్రైమాసికానికి దేశ ఎకానమీ 5. 8 శాతం ఉంది. ఇది చాలా తక్కువ అని, ఉత్పాదక, వ్యవసాయ రంగాల వృద్ది మందగమనంలో ఉన్నట్టు స్పష్టమవుతోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సర్వే ప్రతిపాదించనున్న సూచనలను వారు మదింపు చేస్తున్నారు.

జీఎస్టీ వసూళ్లు ‘ సాదా సీదా ‘ గా ఉన్న నేపథ్యంలో.. ఆర్ధిక లోటును ఈ ఏడాది బడ్జెట్ ప్రస్తావించకపోవచ్ఛునని అంటున్నారు. రెండు వరుస నెలల్లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్ ను దాటగా జూన్ లో పరోక్ష పన్నులు 99,936 కోట్లు ఉన్నాయి. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిసగటు నెలవారీ కలెక్షన్స్ రూ. 1. లక్ష కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. సుబ్రహ్మణ్యన్ కు ముందున్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ తన రీసెర్చ్ పేపర్ లో భారత్ తన ఆర్థిక లోటును 2. 5 శాతం మేర ఓవర్ ఎస్టిమేట్ చేసిందని పేర్కొన్నారు. మొత్తం మీద దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి ఈ ఆర్ధిక సర్వే ఏ సూచనలు చేస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Tags