చంద్రబాబు మాట తప్పారు.. కానీ జగన్ అలా కాదు..

గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయింపులు జరిపిందన్నారు అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి. మొత్తం బడ్జెట్‌లో 13 శాతం కేటాయించడం నిజంగా అభినందించదగిన విషయం అని చెప్పారు. పాదయాత్రలో రైతుల కష్టాన్ని చూసి సీఎం జగన్ బడ్జెట్ రూపొందించారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెప్పిన రైతు భరోసా.. అక్టోబర్ నుంచి ఇవ్వడం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు నాగిరెడ్డి. అలాగే ఉచిత విద్యుత్‌కు చేసిన ఖర్చుతో […]

చంద్రబాబు మాట తప్పారు.. కానీ జగన్ అలా కాదు..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:24 PM

గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయింపులు జరిపిందన్నారు అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి. మొత్తం బడ్జెట్‌లో 13 శాతం కేటాయించడం నిజంగా అభినందించదగిన విషయం అని చెప్పారు. పాదయాత్రలో రైతుల కష్టాన్ని చూసి సీఎం జగన్ బడ్జెట్ రూపొందించారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెప్పిన రైతు భరోసా.. అక్టోబర్ నుంచి ఇవ్వడం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు నాగిరెడ్డి. అలాగే ఉచిత విద్యుత్‌కు చేసిన ఖర్చుతో కలిసి బడ్జెట్ వ్యవసాయం 13.5 శాతం దాటుతుందని చెప్పారు. చంద్రబాబు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని మాట తప్పారని విమర్శించారు. చంద్రబాబులాగా జగన్ మాట తప్పే వ్యక్తి కాదని.. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతులకు జగన్ ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సిద్దమయ్యారని నాగిరెడ్డి తెలిపారు.