తెలంగాణ సోనాకు బ్రాండ్ ఇమేజ్….

తెలంగాణ సోనాకు భారీగా డిమాండ్‌ పెరిగింది. తెలంగాణ సోనాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి.

తెలంగాణ సోనాకు బ్రాండ్ ఇమేజ్....
Follow us

|

Updated on: Aug 15, 2020 | 7:18 PM

తెలంగాణ సోనాకు భారీగా డిమాండ్‌ పెరిగింది. తెలంగాణ సోనాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతోపాటు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ కల్పించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కి బ్రాండ్‌ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ వర్సిటీలు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది.

సెప్టెంబర్‌నాటికి ఈ ఒప్పందం ఫలితాలు కనపడాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీసీ బీ జనార్దన్‌రెడ్డి స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలవల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతల్లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా మారిందని అన్నారు. క్రితంసారి కంటే ఈ ఏడాది తెలంగాణ సోనా సాగు పెరిగిందన్నారు. పీజేటీఎస్‌ఏయూ ఇటువంటి రకం విత్తనాన్ని రూపొందించినందుకు ఉపకులపతి, శాస్త్రవేత్తలను అభినందించారు.

తెలంగాణ సోనాకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి డిమాండ్‌ పెరుగుతున్నదని ఉపకులపతి ప్రవీణ్‌రావు తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా మరిన్ని చర్యలు అవసరమని  అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ శేషాద్రి, పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌ సుధీర్‌కుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ డాక్టర్‌ ఆనంద్‌సింగ్‌, ఐఎస్‌బీ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి డీఎన్‌వీ కుమారగురు మాడరేటర్‌గా వ్యవహరించారు.

ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?