కరోనాపై యుద్ధానికి అర్ధరాత్రి అఘోరాల ప్రత్యేక పూజలు..!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పారద్రోలి.. ప్రజల్ని కాపాడేందుకు సైంటిస్టులంతా వారివారి ప్రయోగాలు వేగవంతం చేశారు. అంతేకాదు.. అనేక మతాలకు చెందిన వారు.. వారి వారి ప్రార్ధనా మందిరాల్లో కూడా కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలగాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో అఘోరాలు కూడా.. కరోనా వైరస్‌ ముప్పు తొలగాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా అరయమంగళంలో ఈ కార్యక్రమం జరిగింది. అఘోరీ మణికంఠన్‌ ఆధ్వర్యంలో ఆరుగురు అఘోరీలతో ఈ […]

కరోనాపై యుద్ధానికి అర్ధరాత్రి అఘోరాల ప్రత్యేక పూజలు..!
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 8:01 PM

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పారద్రోలి.. ప్రజల్ని కాపాడేందుకు సైంటిస్టులంతా వారివారి ప్రయోగాలు వేగవంతం చేశారు. అంతేకాదు.. అనేక మతాలకు చెందిన వారు.. వారి వారి ప్రార్ధనా మందిరాల్లో కూడా కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలగాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో అఘోరాలు కూడా.. కరోనా వైరస్‌ ముప్పు తొలగాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా అరయమంగళంలో ఈ కార్యక్రమం జరిగింది. అఘోరీ మణికంఠన్‌ ఆధ్వర్యంలో ఆరుగురు అఘోరీలతో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. కాశీలో శిక్షణ పొందిన తర్వాత.. అఘోరీ మణికంఠన్‌ తన స్వస్థలంలో జయ అఘోరీ కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ పూజలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఈ మహమ్మారిని నివారించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.