ఉన్నావ్ ఘటనతో సంచలన నిర్ణయం తీసుకున్న యోగీ సర్కార్..

సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచే యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్.. మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఉన్నావ్ అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు.. యూపీ కేబినెట్ నిర్ణయించింది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు.. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయనున్నారు. […]

ఉన్నావ్ ఘటనతో సంచలన నిర్ణయం తీసుకున్న యోగీ సర్కార్..
Follow us

| Edited By:

Updated on: Dec 09, 2019 | 4:33 PM

సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచే యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్.. మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఉన్నావ్ అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు.. యూపీ కేబినెట్ నిర్ణయించింది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు.. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయనున్నారు. వీటిలో 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో అత్యాచార ఘటన కేసులను విచారించేందుకు కాగా.. 74 కోర్టులు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధిచిన కేసులను పరిష్కరించేందకు ఏర్పాటు చేయనున్నారు.

కాగా, తాజాగా ఉన్నావ్ బాధితురాలు మృతిచెందిన తర్వాత.. దేశ వ్యాప్తంగా యూపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యోగీ సర్కార్ ఈ సంచనల నిర్ణయం తీసుకుంది.