జింబాబ్వే టూర్ రద్దు చేసిన బీసీసీఐ

కరోనా ప్రభావంతో టీమిండియా పర్యటనలు ఒక్కటొక్కటిగా రద్దవుతున్నాయి. తాజాగా ఆగస్ట్ నెలలో జరగాల్సిన జింబాబ్వే టూర్‌ను కూడా రద్దు చేసుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల ద‌ృష్ట్యా లంకతో పాటు ఈ జింబాబ్వే టూర్‌‌ను కూడా రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. కరోనా ముప్పు కారణంగా భారత జట్టు శ్రీలంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లట్లేదు అని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. ఇక జింబాబ్వేతో ఆగస్టు […]

జింబాబ్వే టూర్ రద్దు చేసిన బీసీసీఐ
Follow us

|

Updated on: Jun 12, 2020 | 7:37 PM

కరోనా ప్రభావంతో టీమిండియా పర్యటనలు ఒక్కటొక్కటిగా రద్దవుతున్నాయి. తాజాగా ఆగస్ట్ నెలలో జరగాల్సిన జింబాబ్వే టూర్‌ను కూడా రద్దు చేసుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల ద‌ృష్ట్యా లంకతో పాటు ఈ జింబాబ్వే టూర్‌‌ను కూడా రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. కరోనా ముప్పు కారణంగా భారత జట్టు శ్రీలంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లట్లేదు అని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది.

ఇక జింబాబ్వేతో ఆగస్టు 22న మూడు వన్డేల సిరీస్ ఆరంభం కావాల్సి ఉందని షా పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే భారత జట్టు  ప్రాక్టీస్  ప్రారంభమవుతందని తెలిపారు. దేశంలోని పరిస్థితులను బీసీసీఐ నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభింస్తామని షా తెలిపారు.