మేమేం తక్కువ కాదు: ‘శారీ ట్విట్టర్’కు పోటీగా ‘గడ్డం ట్విట్టర్’

సోషల్ మీడియా విస్తరిస్తోన్న నేపథ్యంలో.. అందులో రోజుకో కొత్త ఛాలెంజ్, నయా ట్రెండ్లు పుట్టుకొస్తోంది. అందులో భాగంగా తాజాగా ఇటీవల కొందరు మహిళలు ట్విట్టర్‌లో ‘శారీ ట్విట్టర్’ అంటూ ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. ఇక ఈ ట్రెండ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు మహిళా సెలబ్రిటీలతో పాటు సామాన్య మహిళలు చీరలు కట్టుకొని ఫొటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక తాజాగా వారికి పోటీగా మేమేం తక్కువ కాదు అంటూ పురుషులు రంగంలోకి దిగారు. ‘గడ్డం ట్విట్టర్’ అంటూ.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీనికి ‘బియర్డ్‌ట్విట్టర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెడుతున్నారు. ప్రస్తుతం వారి గడ్డం ట్రెండ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *