Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

ఆర్టీసీని నడపడం అసాధ్యంః కేసీఆర్

CM KCR Review Meeting Updates, ఆర్టీసీని నడపడం అసాధ్యంః కేసీఆర్

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టకుండా.. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. అంతేకాక తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు ఉన్నాయన్నారు. అటు కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలంటే రూ. 240 కోట్లు కావాలని.. పీఎఫ్ బకాయిల కింద నెలకు రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

మరోవైపు సీసీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వడమే కాకుండా.. డీజిల్ బకాయిలను కూడా చెల్లించాలని కేసీఆర్ తెలిపారు. కాలం చెల్లిన 2600 బస్సులను రీ-ప్లేస్ చేయాలన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మరో ఎత్తు ఆర్టీసీని నడపడం… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇక ఈ మొత్తం భారమంతా భరించే శక్తి  ఆర్టీసీకి లేదు.. ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఆర్టీసీ వీటన్నింటిని అధిగమించడానికి ప్రభుత్వం కొంతమేరకు సహాయం చేసినా.. పూర్తిగా వీటి నుంచి బయటపడాలంటే ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు ఛార్జీలు పెంచడం.. ఒకవేళ అదే జరిగితే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆర్టీసీని యధావిధిగా నడపడం అసాధ్యమని సీఎం తేల్చి చెప్పారు. కాగా, రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హైకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉండటం వల్ల.. తీర్పు అనంతరం మరోసారి అన్ని అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

కాగా, ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు హైకోర్టు తీర్పును గౌరవించి సమ్మెను విరమించారు. ప్రభుత్వం షరతులు విధించకుండా కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరిన సంగతి విదితమే. ఈ తరుణంలో రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వెలువడే తీర్పు తర్వాత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.