Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

పవన్ వెర్సస్ జగన్..హస్తిన టూ అమరావతి..!

Pawan Kalyan Delhi tour is a mystery for AP CM YS Jagan, పవన్ వెర్సస్ జగన్..హస్తిన టూ అమరావతి..!

జనసేన అధ్యక్షుడు పవన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కానీ సేనాని అక్కడ ఎవరితో భేటీ అయ్యారు, ఎటువంటి చర్చలు జరిపారు అనే విషయం మాత్రం అస్సలు క్లారిటీ రాలేదు. మాములుగా ఏ పొలిటికల్ లీడర్..రహస్యంగా హస్తిన పర్యటన చేసినా..అక్కడ ఏం చేయబోతున్నాడనే విషయంపై మీడియాకు ఎంతోకొంత ఉప్పందుతుంది. కానీ పవన్ విషయంలో అలా జరగకపోవడం ఇప్పడు మిస్టరీగా మారింది. అంతేకాదు వైసీపీ వర్గాలు, ఇంటిలిజెన్స్‌కు కూడా పవన్ భేటీ అంశాలపై స్పష్టత రాలేదట. దీంతో పవన్ రహస్య పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో పవన్ అడుగులపై వైసీపీ దృష్టి పెట్టింది. వాస్తవానికి వైసీపీపై..టీడీపీ కంటే జనసేనానే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. నిత్యం ప్రెస్ మీట్లు, ట్విట్టర్ వేదికగా ఊహించని విధంగా విరుచుకుపడుతున్నారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్శికుల ఆత్మహత్యలపై అతడు చేపట్టిన లాంగ్ మార్చ్ సక్సెస్‌ అయ్యింది. ఇదే విషయంపై..మోదీని కలిసి ఫిర్యాదు చేస్తానని పవన్ ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకే అతడు ఢిల్లీ వెళ్లాడా..? వెళ్తే..భేటీ ఎందుకు అధికారకంగా జరగలేదు..పవన్, వైసీపీ ప్రభుత్వంపై ఏమైనా ఫిర్యాదు చేశాడా అనే అంశాలపై సీఎం జగన్ కోటరీ ఫోకస్ పెట్టింది.

ప్రభుత్వ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పవన్‌ను కట్టడి చేసేందుకు..సీఎం జగన్ కొత్త గేమ్ ప్లాన్ ఫిక్స్ చేశారట. చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ నడుస్తున్నారనే విషయాన్ని ప్రజలకు వైడర్ రేంజ్‌లో తెలియజెప్పేందుకు  వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని టాక్. అంతేకాదు చంద్రబాబు ఢిల్లీ వెళ్తే..లాలూచీ పడినట్లు అవుతుందని..అందుకే ఆయన పవన్‌ను ఢిల్లీ పంపారని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రెస్ మీట్లకు రెడీ అయిపోయారట. ఏది ఏమైనా పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో..అధికార, విపక్షాల మధ్య మరోసారి మాటల యుద్దం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.