వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌.. కోహ్లీసేనకు సవాల్ విసురుతున్న ఆస్ట్రేలియా!

ముంబై: ప్రస్తుతం జరుగుతోన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆడిన 7 మ్యాచుల్లోనూ విజయం సాధించి 360 పాయింట్లతో ఎవరూ అందన్నంత ఎత్తులో ఉంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా అనూహ్యంగా ఈ రేసులో దూసుకుంటూ రెండో స్థానానికి ఎగబాకడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులోకి రావడం వారికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ క్లీన్ […]

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌.. కోహ్లీసేనకు సవాల్ విసురుతున్న ఆస్ట్రేలియా!
Follow us

|

Updated on: Jan 07, 2020 | 5:37 PM

ముంబై: ప్రస్తుతం జరుగుతోన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆడిన 7 మ్యాచుల్లోనూ విజయం సాధించి 360 పాయింట్లతో ఎవరూ అందన్నంత ఎత్తులో ఉంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా అనూహ్యంగా ఈ రేసులో దూసుకుంటూ రెండో స్థానానికి ఎగబాకడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులోకి రావడం వారికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేయడమే ఇందుకు నిదర్శనం. ఇక కంగారూలు 296 పాయింట్లతో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా కోహ్లీ అండ్ కోకు సవాల్ విసురుతున్నారు. కాగా, పాకిస్థాన్(80), శ్రీలంక(80), న్యూజిలాండ్(60)లతో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.