Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

Pawan Kalyan: దాదాపు 20 సంవత్సరాల తర్వాత పవన్‌తో భూమిక?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ' సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడూ మరిచిపోలేడు. ముఖ్యంగా అందులోని 'భూమిక నల్ల చీర కట్టుకుని..
After Long Time Pawan may Pair with Khushi Fame Heroine Bhumika, Pawan Kalyan: దాదాపు 20 సంవత్సరాల తర్వాత పవన్‌తో భూమిక?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడూ మరిచిపోలేడు. ముఖ్యంగా అందులోని ‘భూమిక నల్ల చీర కట్టుకుని.. చదువుతూ ఉండగా.. వచ్చే సన్నివేశం, ‘నువ్వు చూశావ్’ అనే డైలాగ్స్ కానీ.. ఇప్పటికి కూడా గుర్తొస్తాయి. అంతలా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఖుషీ సినిమాలోని సాంగ్స్, మ్యూజిక్ కూడా ఇప్పటికీ ఫ్రెష్‌గానే అనిపిస్తాయి. ఈ సినిమాలోని భూమిక, పవన్‌ల యాక్టింగ్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి మళ్లీ విరిద్దరూ కలిసి నటించింది లేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ జోడీ స్విల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారట. తాజాగా.. బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్నారు పవన్. ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా చేసేస్తున్నారు. ఇక ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్‌లో పవన్ రెండో సినిమా చేయబోతున్నారనే టాక్ వైరల్ అవుతోంది. ఇది 2021 సంక్రాంతికి విడుదల చేయాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారట. అలాగే ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రూపొందుతుందని అలాగే ఇతర భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఖుషీ సినిమా హిట్ పెయిర్ అయిన భూమిక, పవన్ కలిసి ఈ సినిమాలో నటించనున్నారని.. ఓ టాక్ ఫిల్మ్ వర్గాల్లో ట్రోల్ అవుతోంది. పవన్ సినిమాలో ఒక హీరోయిన్‌గా భూమిక కనిపించనుందట. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా క్రిష్ సినిమాలో నటించనున్నారని టాక్. ఇక ఆ తరువాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

After Long Time Pawan may Pair with Khushi Fame Heroine Bhumika, Pawan Kalyan: దాదాపు 20 సంవత్సరాల తర్వాత పవన్‌తో భూమిక?

Related Tags