Breaking News
  • ఢిల్లీ: దేశవ్యాప్తంగా 56లక్షలు దాటిన కరోన కేసుల సంఖ్య, 90 వేలు దాటిన మృతుల సంఖ్య. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 56, 46, 011 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. గడచిన 24 గంటల్లో 83, 347 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1, 085 మంది మృతి. 9, 68, 377 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 45, 87, 614 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 90, 020 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 89, 746 మంది బాధితులు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.25%, మరణాల రేటు 1.59%.
  • అమరావతి: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై జవాబు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు. పరిహారం చెల్లించకుండానే నిర్వాసితుల భూములు స్వాధీనం చేసుకున్నారని పిటిషన్ దాఖలు. పరిహారం చెల్లించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు.
  • చెన్నై తిరువారుర్ లో ఓఎంజిసి పైప్ లీకేజ్, ముడి చమురు తో నిండిపోయిన పొలాలు. తిరువారూర్ లో వ్యవసాయ పంటపొలాల మధ్యలో ఓఎంజిసి పైప్ లను ఏర్పాటు చేసిన ఓఎంజిసి అధికారులు . ఓఎంజిసి పైప్ పగిలిపోవడం తో భారీగా బయటికి వచ్చిన ముడి చమురు, చుట్టుపక్కల ఉన్న పంటపొలాలకు వ్యాపించడం తో ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని భయం ఆందోళనలో గ్రామస్తులు. పచ్చటి పంటపొలాలు పూర్తిగా ముడి చమురు తో నిండిపోవడం తో తీవ్ర నష్టం వాటిల్లిందని , తమకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళనలు. పంటపొలాల్లో ఉన్న ముడి చమురుని సురక్షితం గా తొలగించడానికి చర్యలు చేపట్టిన ఓఎంజిసి అధికారులు.
  • విశాఖ: పేద ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, టీడీపీకి నా రాక్తం ధారపోశా, పేదలకు ఇళ్లు ఇస్తామంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు, సీఎం జగన్‌కు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు-ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌
  • చెన్నై : ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కి బానిసైన పోలీస్, లక్షలలో డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్య . ధర్మపురి జిల్లాకి చెందిన వెంకటేసన్ , సేలం జిల్లాలోని ప్రత్యేక పోలీస్ బెట్టాలియన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకటేసన్. గత కొంత కాలంగా గంటల తరబడి ఆన్లైన్ రమ్మీ ఆడుతూ లక్షలలో డబ్బులు పోగొట్టుకోవడం తో తీవ్ర మనస్థాపం . గవర్నమెంట్ హాస్టల్ తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య , కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.
  • నిర్మల్: భైంసా మండలం కమోల్‌లో దగ్గర వాగులో చిక్కుకున్న యువకులు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా నీరు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 30 మేకలు, 10 గొర్రెలు. సాయం కోసం యువకుల ఎదురుచూపులు.
  • అమరావతి: అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ. ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో అమలు. జూన్ 1న రాష్ట్రంలో ప్రారంభమైన మనం-మన పరిశుభ్రత. తొలిదశలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు. ప్రజాభాగస్వామ్యంతో పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం. 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట . ప్రజల నుంచి పంచాయతీలకు విరాళాలుగా రూ.1.72 కోట్లు జమ. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ.

కాంగ్రెస్‌‌లో 140 మంది కీలక నేతల రాజీనామా..

Key Congress Leader Quits, కాంగ్రెస్‌‌లో 140 మంది కీలక నేతల రాజీనామా..

రాజీ లేదు.. రాజీనామాలే. ఏఐసీసీలో ఉన్న కీలక పదవులను త్యాగం చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్లు రాజీనామాలు చేస్తున్నారు. రాహుల్‌తో సీనియర్ల భేటీ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు రాజీనామాలపై సంతకాలు చేశారు. ఓటమికి బాధ్యతగా నేనొక్కడినే ఎందుకు.. అందరూ బాధ్యత తీసుకోవాలన్న రాహుల్ డిమాండ్‌కు తలొగ్గిన సీనియర్లు రిజైన్ చేసేస్తున్నారు. వాస్తవానికి రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొద్దని నచ్చచెప్పడానికి వెళ్లిన నేతలు తమకు తాము రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజీనామా చేసిన జాబితాలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు.

అయితే మొత్తం 140 మందికి పైగా నేతలు ఇప్పటికే రాజీనామాలు చేస్తూ.. రాహుల్ గాంధీకి లేఖలు పంపారు. ఇందులో కొందరు తమకు ఎలాంటి పదవులు వద్దని.. రాహుల్ తన పదవికి రాజీనామా చేస్తూ.. రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వారిలో పార్టీ న్యాయ విభాగం అలాగే ఆర్టీఐ విభాగానికి బాధ్యత వహిస్తున్న వివేక్ తన్ఖా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈయననే కాకుండా ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన కొందరు నేతలు కూడా తమ రాజీనామాలను రాహుల్‌కి పంపించారు.

Related Tags