Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

బిగ్‌బాస్‌ను వదలని చిక్కులు..నిషేధించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్యే లేఖ!

Bigg Boss 13: BJP MLA seeks ban on Salman Khan-hosted reality show for degrading Indian culture, బిగ్‌బాస్‌ను వదలని చిక్కులు..నిషేధించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్యే లేఖ!

బిగ్‌బాస్ గేమ్ షో ఎంత ప్రాచుర్యం పొందిందో..అందరికి తెలిసిన విషయమే. నార్త్‌లోనే కాదు దక్షిణాదిన కూడా అన్ని భాషల్లో పాగా వేసింది విదేశాల నుంచి భారత్ బుల్లితెరపైకి దూసుకువచ్చిన వచ్చిన ఈ రియాల్టి షో. కాగా దీనికి ఫాలోవర్స్ ఏ స్థాయిలో ఉన్నారో, వివాదాలు.. ఆరోపణలు కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి.

ఈ షో భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తుందని..అసభ్యకర రీతిలో దుస్తులు ధరిస్తున్నారని, మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎన్నో కేసులు నమోదయ్యాయి. చాలా ప్రొటెస్టులు జరిగాయి. తెలుగుతో అయితే ఏకంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ వివాదాలను పట్టించుకోని  షో ల యాజమాన్యాలు..ఇప్పటికే పలు సీజన్స్‌ను దిగ్విజయంగా కంప్లీట్ చేశాయి. తాజాగా మరోసారి బిగ్‌బాస్ హిందీ షో వార్తల్లో నిలిచింది. ఘజియాబాద్ (యూపీ)కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ గుజ్జర్ బిగ్‌బాస్ షోపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన ‘లోని’ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ లేఖ రాశారు. సమాజంలో అసభ్యతను వ్యాప్తి చేస్తూ, నైతిక విలువలను దెబ్బతీస్తున్న ఈ షోపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. బిగ్‌బాస్ హిందీ షో ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు భారత కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషిచేస్తుంటే.. మరోవైపు ఇలాంటి రియాల్టీ షోలు భారత సంస్కృతి సంప్రదాయాలను మంటగలుపుతున్నాయని విమర్శించారు. జాతీయ స్థాయి ఛానెల్లో హౌస్‌మేట్స్ బెడ్‌రూమ్ దృశ్యాలను చూపిస్తున్నారని.. అలాంటి షోలు చిన్నపిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి షోలు రాకుండే టీవీ కార్యక్రమాలను సైతం సెన్సార్ చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.

బ్రాహ్మణ మహాసభ సైతం బిగ్ బాస్-13 ప్రసారాలను నిలిపివేయాలని కోరుతూ ఘజియాబాద్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఉందని మెమోరాండం సమర్పించారు. షోలో వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు ఒకే మంచంపై పడుకుంటున్నారని.. అలాంటివి ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. అటు ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన సైతం బిగ్ బాస్ షోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రియాల్టీ షోపై నిషేధం విధించే వరకు తాను అన్నం తినబోనని యూపీఎన్‌ఎస్ అధ్యక్షుడు అమిత్ జాని తెలిపారు. కేవలం కూరగాయలు, పళ్లు మాత్రమే తీసుకుంటానని స్పష్టంచేశారు. ఇలా పలు సంఘాలు బిగ్ బాస్‌ను నిషేధించాలని ఆందోళనలు చేస్తుండడంతో నిర్వాహకులకు మళ్లీ కొత్త టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఫిర్యాదులపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.