Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

కల్కీ ఖేల్ ఖతం.. మరి నెక్ట్స్ ఎవరు..?

వెల్ నెస్ కోర్సుల పేరుతో భారీగా విరాళాలు సేకరించి పక్కదారి పట్టించిన కల్కీ ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాత్విక, ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎర వేసి.. పెద్ద మొత్తంలో సేకరించిన కోట్లాది రూపాయలను తమ సొంత వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కల్కీ ఆశ్రమాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ, తమిళనాడులో కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు సోదాల్లో గుర్తించారు. ఇప్పటి వరకూ రూ.43.9 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సుమారు 40 ప్రాంతాల్లో ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలు, వెల్‌‌నెస్ సెంటర్లు, కల్కి కుమారుడు కృష్ణ నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ సోదాల్లో రూ.43.9 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విలువైన మిలియన్ యూఎస్ డాలర్లు, 26 కోట్ల విలువైన 88 కిలోల బంగారం, 5 కోట్ల విలువైన 1271 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2014-2015లో విదేశీ కంపెనీల్లో రూ. 409 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. 25 ఏళ్ల క్రితం కల్కి ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఆశ్రమ పేరును తరుచూ మార్చడానికి కారణాలేంటన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ట్రస్టు ఆస్తులు, బినామీలు, భూములకు సంబంధించిన పత్రాలతో కూడిన హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కల్కీ దంపతులు అజ్ఞాతంలోకి వెళిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు. ఇదిలా వుంటే, కల్కి భగవాన్‌‌ను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ మొదలైంది. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిన స్వాములు, మఠాలు, ఆశ్రమాలు వేలాదిగా పుట్టుకొస్తున్నాయి.

ఊరికో ఆశ్రమం వెలుస్తోంది. రోజుకో బాబా పుట్టుకొస్తూ తాను ఓ దేవుడినని చెప్పుకుంటూ.. అమాయకుల నుంచి వేలకోట్లు దోచుకుంటున్నారు. ఆధ్యాత్మిక సేవ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి రాజకీయ నాయకులను కూడా శాసిస్తున్నారు. వారిని మాయలో పడేసి వేలకోట్లకు అధిపతులు అవుతున్నారు. ఇక కల్కీ భగవాన్ అంతం తర్వాత ఏపీలోని మరో ప్రముఖ స్వామి ఆశ్రమాలపై కూడా దాడులు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారం చేస్తూ వేలకోట్లు కొల్లగొడుతున్న దొంగ స్వాముల ఆగడాలకు ఐటీ అధికారులు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.