జియో గిగాఫైబర్‌కు పోటీగా హాత్ వే

After JioFiber broadband.. Hathway is now offering 100Mbps plans starting from Rs 699, జియో గిగాఫైబర్‌కు పోటీగా హాత్ వే

జియో.. టెలికాం రంగంలో పోటీ వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా గిగా ఫైబర్‌ను లాంచ్ చేయడంతో.. బ్రాడ్ బ్యాండ్‌ కంపెనీల మధ్య పోటీ పెరిగిపోయింది. జియో గిగాఫైబర్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే వినియోగాదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం జియోకి పోటీగా హాత్ వే దిగింది. సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది. నెలకు రూ.699తో 100 ఎంబీపీఎస్ వేగంతో సేవలు లభించే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతానికి ఇది కోల్‌కతా సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ఎఫ్‌యూపీ పరిమితి 1టీబీ గా ఉంది. వచ్చే నెల 5 నుంచి జియో ఫైబర్ సేవలు వాణిజ్యపరంగా ప్రారంభం కానుండడంతో హాత్‌వే ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అయితే, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికే ఇది వర్తిస్తుందని సంస్థ తెలిపింది.

రూ.699 ప్లాన్‌లో భాగంగా 100 ఎంబీపీఎస్ వేగంతో 1 జీబీ /1 టీబీ ఎఫ్‌యూపీ లిమిట్‌‌తో సేవలు లభిస్తాయి. ఒకసారి ఎఫ్‌యూపీ పరిమితి దాటితే వేగం 3 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. త్వరలోనే ఈ ప్లాన్‌ను హాత్‌వే అన్ని సర్కిళ్లకు విస్తరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *