కుక్కలు, కోతుల తర్వాత పావురాలే టార్గెట్..? ఎందుకో తెల్సా..?

హైదరాబాద్‌లో.. కుక్కల, కోతుల, పావురాల సంచారం ఎక్కువ. ఈ మధ్య కుక్కలు కూడా వీధిలో కనిపించడం లేదు. జనసంచారం కన్నా.. కుక్కల సంచారం ఎక్కువగా ఉన్నందున వాటి చెక్‌ పెట్టింది జీహెచ్‌ఎంసీ. ఒంటరిగా ఓ వ్యక్తి వెళ్తే చాలు.. వారిపై దాడి చేసి.. ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చేవి. చాలా మంది ఇంటి నుంచి బయటకు రావాలంటే.. భయపడేవారు. ఇక చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో.. చిన్న పిల్లలను నోటితో కరుచుని.. […]

కుక్కలు, కోతుల తర్వాత పావురాలే టార్గెట్..? ఎందుకో తెల్సా..?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2019 | 1:33 PM

హైదరాబాద్‌లో.. కుక్కల, కోతుల, పావురాల సంచారం ఎక్కువ. ఈ మధ్య కుక్కలు కూడా వీధిలో కనిపించడం లేదు. జనసంచారం కన్నా.. కుక్కల సంచారం ఎక్కువగా ఉన్నందున వాటి చెక్‌ పెట్టింది జీహెచ్‌ఎంసీ. ఒంటరిగా ఓ వ్యక్తి వెళ్తే చాలు.. వారిపై దాడి చేసి.. ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చేవి. చాలా మంది ఇంటి నుంచి బయటకు రావాలంటే.. భయపడేవారు. ఇక చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో.. చిన్న పిల్లలను నోటితో కరుచుని.. బాగా గాయపరిచేవి. ఈ మధ్య వాటి బెడద కాస్త తగ్గింది అనుకునే లోపు.. పావురాల తాకిడి ఎక్కువైంది.

హైదరాబాద్‌లో ఈ మధ్య.. ఏ ప్రదేశంలో చూసినా.. ఏ అపార్ట్‌మెంట్స్‌లో చూసినా పావురాలు.. వాటి రెట్టలే దర్శనమిస్తాయి. ఈ మధ్య వాటి సంఖ్య మరీ విపరీతంగా పెరుగుపోతోంది. వాటిని చూడటానికి బాగానే.. ఉన్నా.. వాటి వల్ల వచ్చే వ్యాధులు, వ్యాపించే వైరస్‌లు అడ్డుకోవడం మన వల్ల కావట్లేదు. అందులోనూ.. ఇప్పడు డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నారు. అంతేకాకుండా.. వీటి వల్ల చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. దీంతో.. ఎలాగైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

హైదరాబాద్‌లోని దాదాపు 500 పావురాలను పట్టుకొని శ్రీశైలం అడవులకు తరలించారు. పావురాల రెట్టలతో.. ముఖ్యంగా మొజాంజాహీ మార్కెట్ అందవిహీనంగా తయారవుతోంది. జనసంచారం ఉన్న చోట పావురాలు ఎక్కువగా ఉండటం వల్ల.. శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం అటవీశాఖ అధికారులు పావురాలను తీసుకెళ్లి శ్రీశైలం అడవుల్లో వదిలారు. కాగా.. ఇప్పుడు పావురాలను అడవిలో వదిలేశాం కదా.. అని చేతులు దులిపేసుకుంటే.. సరిపోదు.. ఇక్కడో టర్నింగ్ పాయింట్ ఉంది. పావురాలకు.. భూమిపై ఎక్కడ వదిలినా.. తిరిగి వాటి గమ్యస్థానానికి వచ్చేయగలిగే గ్రాహక శక్తి ఉంటుంది. అందువల్ల అవి తిరిగి మొజాంజాహీ మార్కెట్‌కి వచ్చేసే అవకాశాలు కూడా మొండుగా ఉన్నాయి.