Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

ఆ ఎంపీ నాలుగు మేకలు దొంగిలించాడు.. యూపీలో కేసు నమోదు..!

After Buffalo and Books Theft Case Samajwadi MP Azam Khan Now Booked for Stealing Goats, ఆ ఎంపీ నాలుగు మేకలు దొంగిలించాడు..  యూపీలో కేసు నమోదు..!

యూపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలకు మరోపేరు. ఆయన ప్రస్తుతం విచిత్రమైన కేసుల బెడదతో సతమతమవుతున్నారు. ఇప్పటివరకు ఆయనపై 82 కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిలో ప్రధానమైనవి భూ కబ్జాఆరోపణలే. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆజాంఖాన్ తాజాగా ఒక విచిత్రమైన కేసులో ఇరుకున పడ్డారు.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజాంఖాన్ ఆపార్టీలో సీనియర్ నేత. ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆయనపై పదుల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నిటిపై దర్యాప్తు చేయడం ఉత్తరప్రదేశ్ పోలీసులకు తలకుమించిన భారంగా పరిణమించింది. యతీంఖాన్ సరాయ్ గేట్ ప్రాంతానికి చెందిన ససీమా ఖాతూన్ (50) అనే మహిళ 2016లో అక్టోబర్ 15వ తేదీన ఎంపీ అజాంఖాన్ తన మేకలు దొంగిలించారంటూ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన 25 మంది అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడి చేశారని, తన ఇంట్లో ఉన్న బంగారం, గేదెలు, ఆవులు, నాలుగు మేకల్ని వీరంతా ఎత్తుకుపోయారంటూ ఆరోపించింది. తాను వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిలో కౌలుదారునని, రెండు దశాబ్దాలుగా కౌలుదారుగా ఉన్నానంటూ నసీమా తన ఫిర్యాదులో పేర్కొంది. వక్ఫ్‌కి చెందిన భూమిని కబ్జా చేయడానికి అజాంఖాన్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది.

నసీమా ఖాతున్ ఈ ఫిర్యాదును 2016లో చేయగా .. ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక ఎంపీ నాలుగు మేకలు దొంగిలించారని ఆరోపించడం స్ధానికంగా కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఆజాంఖాన్ భార్య కరెంట్ దొంగిలించారనే కేసు కూడా నమోదైంది. అయితే ఇటువంటి కేసులు ఎంపీ అజాంఖాన్‌కు కొత్తేమీ కాదని, ఇలాంటి ఎన్నో నమోదయ్యాయంటున్నారు స్ధానికులు.

Related Tags