ముహూర్తం ఒకరితో..పెళ్లి మరొకరితో..

ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే పెళ్ళిళ్లు క్యాన్సిల్‌ అవుతున్నాయి. పీటలదాకా వచ్చి ఆగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నోర్‌ జిల్లా నంగల్‌జత్‌ గ్రామంలో జరిగింది. ముహూర్తానికి రావల్సిన పెళ్లికొడుకు కాస్త ఆలస్యంగా వచ్చాడని అతను నాకొద్దంటూ మరొకరిని పెళ్లి చేసుకుంది ఆ నవ వధువు. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి ముహూర్తం..రంగురంగుల పూలతో, భాజాభజంత్రీలతో మండపం కళకళలాడిపోతోంది. వచ్చీ పోయే అతిథులతో అంతా కోలాహలంగా ఉంది. పెళ్లికూతురు తాళి కట్టించుకునేందుకు అందంగా ముస్తాబై సిగ్గులొలకబోస్తూ కూర్చుంది. […]

ముహూర్తం ఒకరితో..పెళ్లి మరొకరితో..
Follow us

|

Updated on: Dec 09, 2019 | 4:42 PM

ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే పెళ్ళిళ్లు క్యాన్సిల్‌ అవుతున్నాయి. పీటలదాకా వచ్చి ఆగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నోర్‌ జిల్లా నంగల్‌జత్‌ గ్రామంలో జరిగింది. ముహూర్తానికి రావల్సిన పెళ్లికొడుకు కాస్త ఆలస్యంగా వచ్చాడని అతను నాకొద్దంటూ మరొకరిని పెళ్లి చేసుకుంది ఆ నవ వధువు.

మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి ముహూర్తం..రంగురంగుల పూలతో, భాజాభజంత్రీలతో మండపం కళకళలాడిపోతోంది. వచ్చీ పోయే అతిథులతో అంతా కోలాహలంగా ఉంది. పెళ్లికూతురు తాళి కట్టించుకునేందుకు అందంగా ముస్తాబై సిగ్గులొలకబోస్తూ కూర్చుంది. ఐతే ముహూర్త సమయం దాటిపోతున్నా వరుడు కానీ, వారి బంధువులు కానీ పత్తా లేరు. గంట, 2 గంటలు ఇలా సమయం గడిచిపోతోంది. మగపెళ్లివారు ఊరేగింపుతో తీరిగ్గా సాయంత్రానికి వచ్చారు. దీంతో విసిగిపోయిన వధువు..ఆమె తరపు బంధువులు..ఆ పెళ్లి తమకిష్టం లేదని కుండబద్దలు కొట్టేశారు.

ఇక ఆ తర్వాత మగపెళ్లివారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అమ్మాయికి బంగారు ఆభరణాలెన్నో చేయించామని..కాస్త ఆలస్యమైందని ఇప్పుడు పెళ్లి వద్దంటున్నారని కంప్లైంట్‌ ఇచ్చారు. దీంతో ఆడపెళ్లివారిని పిలిచి విచారిస్తే మండపానికి ఆలస్యంగా వచ్చిందే కాకుండా అదనపు కట్నం అడుగుతున్నారని..ఇలాంటి ఇంటికి తమ ఆడబిడ్డను ఎలా పంపిస్తామని ప్రశ్నించారు. దీంతో ఇంత గొడవ జరిగిన తర్వాత బలవంతంగా పెళ్లి చేయడం మంచిది కాదని..భవిష్యత్తులో మరిన్ని సమస్యలొచ్చే అవకాశముందని..ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు పోలీసులు. ఆ తర్వాత వధువుకు మరో వ్యక్తితో బంధువులు, గ్రామస్తుల సమక్షంలో వివాహం జరిపించారు కుటుంబసభ్యులు.