Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

మొన్న సినిమా..నేడు దోసె …సీన్ మారింది…

Rahul, మొన్న సినిమా..నేడు దోసె …సీన్ మారింది…

కామన్ మ్యాన్ లా మొన్న హిందీ మూవీ.. ‘ ఆర్టికల్-15 ‘ ని ఢిల్లీలోని ఓ థియేటర్ లో చూసిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తాజాగా పాట్నాలోని ఓ చిన్న రెస్టారెంట్ లో దోసె తింటూ కనిపించారు. (బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆ సినిమా రాహుల్ ని ఇంప్రెస్ చేసింది మరి) ! పరువు నష్టం కేసులో పాట్నాలోని కోర్టు బెయిలు మంజూరు చేయడంతో.. రాహుల్ ఢిల్లీ వెళ్ళడానికి విమానాశ్రయానికి వెళ్లేముందు.. ఈ హోటల్ చేరుకొని అక్కడ సౌతిండియన్ డిష్ అయిన దోసెను ఇష్టంగా తిన్నారు. ఆయన వెంట ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్, రాష్ట్ర పార్టీ చీఫ్ మదన్ మోహన్ ఝా తదితరులున్నారు. రాహుల్ దోసె తినడాన్ని పలువురు జర్నలిస్టులు ఎంచక్కా ఫోటోలు తీసుకున్నారు. ఆయన సెక్యూరిటీ కూడా ఇందుకు అనుమతినిచ్చింది.
‘ దొంగలందరికీ ఇంటిపేరు మోదీ ‘ అని ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఆయనపై పరువునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన పాట్నాకోర్టు.. రూ. 10 వేల పూచీకత్తుపై ఆయనకు బెయిలు మంజూరు చేసింది. మోదీ ప్రభుత్వానికి గానీ, బీజేపీ-ఆర్ఎస్సెస్ కి గానీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని మోదీ సర్కార్ కోర్టు కేసులతో భయపెడుతుందని రాహుల్ దుయ్యబట్టారు.

Related Tags