మరో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వలస కార్మికులు మృతి

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలస కార్మికులు వారి వారి గమ్యస్థానాలకు పయనమవుతున్నారు. వందల కిలోమీటర్ల దూరం ఉన్నా.. వీ డోంట్ కేర్ అంటూ వాక్ చేస్తూ కొందరు వెళ్తుండగా.. మరికొందరు లారీలు, ట్రక్కుల్లో వెళ్తున్నారు. ఇలా వెళ్తుండగా.. కొందరు ప్రమాదాల బారినపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శనివారం యూపీలో 24 మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే.. మధ్యప్రదేశ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ […]

మరో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వలస కార్మికులు మృతి
Follow us

| Edited By:

Updated on: May 16, 2020 | 1:08 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలస కార్మికులు వారి వారి గమ్యస్థానాలకు పయనమవుతున్నారు. వందల కిలోమీటర్ల దూరం ఉన్నా.. వీ డోంట్ కేర్ అంటూ వాక్ చేస్తూ కొందరు వెళ్తుండగా.. మరికొందరు లారీలు, ట్రక్కుల్లో వెళ్తున్నారు. ఇలా వెళ్తుండగా.. కొందరు ప్రమాదాల బారినపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శనివారం యూపీలో 24 మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే.. మధ్యప్రదేశ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని బండా సమీపంలో ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు వలస కార్మికులు ప్రాణాలు విడిచారు. మహారాష్ట్ర నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.

కాగా, ఇవాళ ఉదయం యూపీలోని అవురియా ప్రాంతంలో జరిగిన సంఘటనలో రెండు ట్రక్కులు ఢీ కొట్టుకోవడంతో.. 24 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.