Breaking News
  • తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి. తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈశాన్య ఝార్ఖండ్, ఒరిస్సా మీదుగా 1.5 కి.మీ 5.8 కి.మీ ఎత్తు మధ్య ఏర్పడిన మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు. ఈరోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, నారాయణ పేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం.
  • కడప: ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల ఫోర్జరీ కేసు. నిందితుడు సుబ్రమణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొందరిని ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు.
  • ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజునుప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ను ఆరోజు ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
  • ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన దీపికాపదుకొనె. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో దీపికా విచారణ. కరీష్మా, దీపికా చాటింగ్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం. కరీష్మాతో పరిచయం, డ్రగ్స్‌ సప్లయ్‌పై 4 గంటలుగా విచారణ. పల్లార్డ్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో శ్రద్ధా, సారా విచారణ. త్వరలో కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేసే అవకాశం.
  • మంచిర్యాల: బెల్లంపల్లిలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. అదనపు కట్నం కోసం భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త మధుకర్‌. గతేడాది ఫిబ్రవరిలో మధుకర్‌తో విజయ వివాహం. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులు. అత్తింటివారితో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.
  • గుంటూరు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారికి గాయం. తెనాలిలోని తన ఇంట్లో కాలుజారిపడ్డ నన్నపనేని. నన్నపనేని రాజకుమారి తలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

రాయుడు.. ఇక్కడకు రా.. మా దేశంలోనే ఉండిపో

Iceland cricket offer to Ambati Rayudu, రాయుడు.. ఇక్కడకు రా.. మా దేశంలోనే ఉండిపో

ఈ ప్రపంచకప్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు స్థానం లభిస్తుందని చాలా మందే భావించారు. అయితే కొన్ని కారణాల వలన రాయుడిని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. ఇక ఇటీవల విజయ్ శంకర్ గాయంతో ఆటకు దూరం అవ్వడంతో.. అతడి స్థానంలోనైనా అంబటికి చోటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా బీసీసీఐ మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో అతడికి ఓ దేశం బంపర్ ఆఫర్ ఇచ్చింది. మా దేశానికి వచ్చెయ్.. ఇక్కడే ఉండిపో అంటూ ఆ దేశ క్రికెట్ సంస్థ తెలిపింది.

‘‘రాయుడు 3డీ గ్లాసెస్‌ను ఇప్పుడైనా పక్కనపెట్టు. మామూలు అద్దాలతో డాక్యుమెంట్లు చదువు. వచ్చి మాతో చేరు. రాయుడంటే మాకెంతో ఇష్టం’’ అని ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. ఐల్యాండ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా దానికి జత చేసింది. అయితే ఐస్‌లాండ్ ఇచ్చిన ఈ ఆఫర్‌పై అంబటి రాయుడు ఇంకా స్పందించకపోగా.. నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సెలక్టర్లకు గట్టి చెంపదెబ్బ తాకేలా ఐస్‌లాండ్ క్రికెట్ ఆఫర్ ఇచ్చిందని కొందరు.. ఈ ఆఫర్‌ను రాయుడు ఒప్పుకుంటే విదేశీ ఆటగాడు అవుతాడు కాబట్టి.. ఐపీఎల్ జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకం అవుతుందని మరికొందరు తమ కామెంట్లను పెట్టారు.

Related Tags