ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం పక్కా ప్లాన్..

After Ajit Doval Returns From J&K.. Centre Moves 10000 Troops To State, ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం పక్కా ప్లాన్..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేటకు కేంద్రం పక్కా ప్లాన్ వేస్తోంది. ఇందు కోసం జ‌మ్మూకశ్మీర్ రాష్ట్రానికి సుమారు 10వేల మంది పారామిలిట‌రీ ద‌ళాల‌ను పంపుతోంది. నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్ అజిత్ దోవ‌ల్ ఇటీవ‌ల క‌శ్మీర్‌లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. అక్క‌డ ఆయ‌న ఉన్న‌త అధికారుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా నార్త్ కశ్మీర్‌లో అదనపు బలగాలు కావాలంటూ కేంద్రాన్ని కోరినట్లు కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. దేశంలోకి చొర‌బాటుదారుల‌ను రాకుండా అడ్డుకునేందుకు అద‌న‌పు బ‌ల‌గాల‌ను పంపిస్తున్న‌ట్లు కేంద్ర హోంశాఖ త‌న ఆదేశంలో పేర్కొన్న‌ది. దేశంలోని వివిధ ప్రాంతాల‌ను నుంచి పారామిలిట‌రీ ద‌ళాల‌ను క‌శ్మీర్‌కు పంపిస్తున్న‌ట్లు తెలిపారు. మొత్తం వంద కంపెనీల ద‌ళాల‌ు ఇప్పటికే క‌శ్మీర్‌కు చేరుకున్నాయి. కాగా, ఇటీవ‌ల అమర్‌నాథ్ యాత్ర కోసం 40 వేల అద‌న‌పు కేంద్ర బ‌ల‌గాల‌ను కూడా అక్క‌డ‌కు తీసుకువెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *