నల్ల జాతీయుల ప్రగతి కోసం.. లింకన్ తర్వాత నేనే..

అమెరికాలోని నల్లజాతీయుల కోసం తాను ఎంతగానో కృషి చేశానని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నల్ల జాతీయుల ప్రగతి కోసం.. లింకన్ తర్వాత నేనే..
Follow us

|

Updated on: Jun 14, 2020 | 4:08 PM

అమెరికాలోని నల్లజాతీయుల కోసం తాను ఎంతగానో కృషి చేశానని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యూఎస్ చరిత్రలో అబ్రహం లింకన్ అత్యంత ప్రాచుర్యం పొందిన అధ్యక్షులలో ఒకరు. నల్ల జాతీయుల ప్రగతికి పాటుపడిన అమెరికా అధ్యక్షుల్లో లింకన్ తర్వాత తాను రెండో స్థానంలో ఉంటానని ట్రంప్ చెప్పుకొచ్చారు.

వారు చదువుకునే కాలేజీలు, యూనివర్సిటీలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా.. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా నల్ల జాతీయుల కోసం నిధులు కేటాయించానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అటు తక్కువ ఆదాయం కలిగిన వారికి కూడా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా పన్ను మినహాయింపులు ఇచ్చినట్లుగా వివరించారు. కాగా, అమెరికాలో నల్ల జాతీయుడు ఫ్లాయిడ్ హత్య ఆ దేశంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన విషయంలో ట్రంప్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.