‘ఎంటీఆర్‌ ఫుడ్స్‌’ కంపెనీలో 40 మంది ఉద్యోగులకు కరోనా

ప్రముఖ రెడీ టూ ఈట్‌ ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ తయారీదారు ‘ఎంటీఆర్‌ ఫుడ్స్‌’ కంపెనీలో కరోనా కలకలం రేపింది. ఏకంగా కంపెనీలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో

‘ఎంటీఆర్‌ ఫుడ్స్‌’ కంపెనీలో 40 మంది ఉద్యోగులకు కరోనా
Follow us

|

Updated on: Jul 16, 2020 | 8:19 PM

ప్రముఖ రెడీ టూ ఈట్‌ ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ తయారీదారు ‘ఎంటీఆర్‌ ఫుడ్స్‌’ కంపెనీలో కరోనా కలకలం రేపింది. ఏకంగా కంపెనీలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 20 వరకు ఎంటీఆర్‌ ఫుడ్స్‌ కంపెనీ కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయించింది.

కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మసాంద్రలో గల ఎంటీఆర్ ఫుడ్స్‌ కంపెనీ ఫ్యాక్టరీలో తొలుత జూలై 6న మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. దీంతో వెంటనే కార్యకలాపాలను నిలిపేసిన కంపెనీ యాజమాన్యం..ఫ్యాక్టరీ ప్రాంగణం మొత్తం శానిటైజ్‌ చేశారు. జూలై 7 న ఫ్యాక్టరీ మూసివేసిన అధికారులు..శానిటైజేషన్ ప్రొటోకాల్స్‌ పాటించారు. ప్రైమరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్‌ చేశారు. అలాగే, సెకండరీ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌లో ఉంచామని చెప్పారు. జూలై 10న ఫ్యాక్టరీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఆరోగ్యశాఖ అధికారులు అనుమతి కూడా ఇచ్చారు.

అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాము మరో పది రోజులు కంపెనీని మూసివేయాలని నిర్ణయించినట్లు యజమానులు తెలిపారు. అయితే, ఇప్పటికే సూపర్‌మార్కెట్లలో ఉన్న తమ ఉత్పత్తుల గురించి ఆ సంస్థ స్పందిస్తూ..తమ కంపెనీలో ఉత్పత్తులను యంత్రాల సహాయంతో ప్యాకింగ్‌ చేస్తామని, మనుషుల ప్రమేయం ఉండదని చెప్పారు.. బెంగళూరులో వారం రోజుల లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు.